గుంటూరు: కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాతపడిన వారి కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఇలా పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బుధవారం ఉదయం 8 గంటల నుండి తన కార్యాలయంలో ఆలపాటి నిరాహార దీక్షుకు దిగారు. సాయంత్రం 8 గంటల వరకు అంటే మొత్తంగా 12గంటలు నిరాహారదీక్షలోనే వుండనున్నారు. ఆయనతో పాటు స్థానిక టిడిపి నాయకులు పిల్లి మాణిక్యరావు, కోవెలమూడి  రవీంద్ర నాని  దీక్షలో కూర్చున్నారు. 
 
వైసిపి ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లివే: 

మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. 

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి కరోనా సహాయం నిమిత్తం రూ.5000  ఇవ్వాలి. 

కరోనా వైరస్ తో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.