Asianet News TeluguAsianet News Telugu

జగన్ గారూ....బాబు వస్తానంటే అలా అన్నారు, కనగరాజు ఎలా వచ్చారు: అచ్చెన్న

చంద్రబాబు ఏపీకి వస్తానంటే 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన మంత్రులు అన్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేస్తూ కనగరాజ్ ఎలా వచ్చారని ప్రశ్నించారు.

TDP leader acchennaidu questions YS Jagan on Kanagaraju
Author
Visakhapatnam, First Published Apr 11, 2020, 2:12 PM IST

విశాఖపట్నం: సీఎం గారూ, అత్యధిక కరోనా కేసులున్న తమిళనాడు నుంచి  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి జ‌స్టిస్ క‌న‌గ‌రాజ్ ఏపీకి ఎలా వచ్చారని తెలుగుదేశం శాసనసభా పక్షం (టీడీెల్పీ) ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగరాజు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే

తెలంగాణ బోర్డ‌ర్‌లో వేలాదిమంది ఏపీవాళ్ల‌ు క్వారంటైన్‌కి వెళ్తామంటేనే రానిస్తామ‌న్న మీరు దీనికేమి స‌మాధానం చెబుతారని అడిగారు. 
కరోనాకోరల్లో చిక్కి రాష్ట్రం విలవిల్లాడుతోందని, పనుల్లేక కూలీలు, పంటలు అమ్మలేక రైతులు, స‌క‌ల‌వ‌ర్గాలు త‌మ‌ను ఆదుకోవాలంటూ చేస్తున్న ఆక్రందనలు జగన్ కు వినిపించడం లేదని ఆయన అన్నారు. 

Also Read: రంగంలోకి దిగిన కొత్త ఈసీ కనగరాజ్: రమేష్ కుమార్ కు నో చాన్స్.

కరోనా వ్యాప్తి జరగకుండా ఎన్నికలు వాయిదావేసిన కమిషనర్ ని తొలగించేందుకు అత్యవసర ఆర్డినెన్స్, సెలవురోజుల్లో రహస్యజీవోలిచ్చారని ఆయన విమర్శించారు. 
క‌రోనా ప్ర‌భావం వృద్ధుల‌పై ఎక్కువ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నా  కనగ‌రాజ్‌ని తీసుకొచ్చారని ఆయన అన్నారు. కనగ రాజుకేమైనా క‌రోనా క‌ట్ట‌డి చేసే శాస్ర్త‌వేత్తా? వైద్యుడా అని ప్రశ్నించారు. 

బాధ్య‌త‌లు స్వీక‌రించేట‌ప్పుడు మాస్క్ కూడా పెట్టుకోని కనగరాజు రాష్ట్ర ప్ర‌జ‌ల ప్రాణాల‌తోనూ చెల‌గాటమాడుతున్నారని ఆయన విమర్శించారు. స్వార్థయోజ‌నాల కోసం లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న మీరు, మీ మంత్రులు క్వారంటైన్ పాటిస్తున్న చంద్ర‌బాబును ద‌మ్ముంటే హైద‌రాబాద్ నుంచి ర‌మ్మంటున్నారని ఆయన జగన్ ను ఉద్దేశించి అన్నారు. పాలన చేతకాదని భేషరతుగా ఒప్పుకోవాలని, చంద్రబాబు వచ్చి పాలనంటే ఏంటో చూపిస్తారని ఆయన అన్నారు.

కనగరాజ్ లాక్ డౌన్ ఉల్లంఘన కాదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి జరగకుండా ఎన్నికలను వాయిదా వేశారని చెప్పిరహస్య జీవోలిచ్చారని, రమేష్ కుమార్ ను తీసేయడానికికరోనా ప్రభావం ఉన్నా కూడా కనరాజ్ ను ఎలా తెచ్చారని అచ్చెన్నాయుడు అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios