Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కారుని ఇరుకున పెట్టే పదవి... టీడీపీ నేతల పోటీ

విపక్ష పార్టీకే దక్కే పీఏసీ కమిటీ ఛైర్మన్ ఎంపిక విషయంలో చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిక పార్టీని ఇరుకున పెట్టే అధికారం పీఏసీకి ఉంది.. దీంతో... ఆ పదవిని ఎవరికి కేటాయించాలనే విషయంపై చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
 

tdp key leader may appointed as a PAC Chairman role
Author
Hyderabad, First Published Jul 22, 2019, 12:07 PM IST

సభా కమిటీలపై స్పీకర్ తమ్మినేని సీతారం కసరత్తు మొదలుపెట్టారు. వివిధ కమిటీల్లో ప్రాతినిద్యం వహించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల నుంచి స్పీకర్ కార్యాలయం పేర్లు అడిగింది. కాగా... జగన్ సర్కారులో కేబినేట్ హోదా దక్కే పీఏసీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలోని పలువురు నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

కాగా..ఛైర్మన్ ఎంపికై ప్రతిపక్ష నేత చంద్రబాబు కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. విపక్ష పార్టీకే దక్కే పీఏసీ కమిటీ ఛైర్మన్ ఎంపిక విషయంలో చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిక పార్టీని ఇరుకున పెట్టే అధికారం పీఏసీకి ఉంది.. దీంతో... ఆ పదవిని ఎవరికి కేటాయించాలనే విషయంపై చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పీఏసీ ఛైర్మన్ గా వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహరించారు. ఆయన ఆ పదవిలో ఉండి చంద్రబాబు సర్కార్ కి చుక్కలు చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే... ఈసారి ఆ పదవిలో తమ పార్టీ నేతను ఉంచాల్సిన అవసరం రావడంతో... కీలక వ్యక్తిని కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ పదవి కోసం టీడీపీ నేతలు పలువురు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios