TDP Janasena: రేపే చంద్రబాబు- పవన్ భేటీ .. సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చేనా.. ?

TDP Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు భేటీ కానున్నట్టు సమాచారం. పలు కీలక పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు భేటీ కావడంపై చర్చనీయంగా మారింది.  

TDP Janasena Alliance Chandrababu Naidu meets Janasena chief Pawan Kalyan KRJ

TDP Janasena : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ సింగల్ గా బరిలో దిగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష టీడీపీ- జనసేనలు మాత్రం ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. కానీ.. ఇరుపార్టీల మధ్య సీట్ల పంపకాలపై మాత్రం క్లారటీ రాలేదు. ఈ తరుణంలో ఆ పొత్తుల లెక్కలను ఓ కొలిక్కి వచ్చేందుకు ఇరుపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపు ( బుధవారం) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లు భేటీ కానున్నట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నిర్వహిస్తున్న "రా... కదలిరా" అనే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అమరావతి పర్యాటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు సమావేశమై సీట్ల పంపకాలపై వర్కవుట్ చేయనున్నారని సమాచారం. ఆ బేటీ అనంతరం తొలుత జాబితాను విడుదల చేసేందుకు టీడీపీ- జనసేన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

పొత్తులో భాగంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను ఎలా సర్దుబాటు చేస్తారో అనే విషయంపై కూడా ఓ క్లారిటీ రానున్నట్టు టాక్. కాగా.. సీట్ల కేటాయింపు విషయంలో జనసేనాని కాస్త సర్దుకుపోయే ధోరణితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త తగ్గనట్టు.. పవన్ కళ్యాన్ కేవలం 25 నుంచి 30 ఎమ్మెల్యే స్థానాలు, అలాగే 2 నుంచి 4 ఎంపీ సీట్లను మాత్రమే ఆశిస్తున్నారని తెలుస్తోంది.

మరోవైపు.. చంద్రబాబు- పవన్ కల్యాణ్ లకు సీట్ల కేటాయింపులో వివాదం చెలారేగినట్టు తెలుస్తోంది. ఇరుపార్టీల మధ్య పొత్తులో ఉన్నట్టు బాహాటంగా ప్రకటించినా.. మండపేట, అరకు స్థానాలను చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన జనసేనాని పవన్ ఆ ప్రకటనకు కౌంటర్ గా రెండు సీట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ సమయంలో తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని పాటించలేదనీ, దీంతో తాము కూడా అదే బాటలో నడిచామని జనసేనాని తెలిపారు. ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీతో ఇరు పార్టీల పొత్తుతో పాటు సీట్లు సర్దుబాటుపై ఓ క్లారిటీ వచ్చే అవగాహన ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios