నెల్లూరు: ప్రస్తుత కష్టకాలంలో వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష పార్టీల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటే బావుండేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తమిళనాడు, కేరళ సీఎంలు ప్రతిపక్ష నాయకుల సాయం కోరటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. జగన్ రెడ్డి వారిని చూసి నేర్చుకోవాలని సోమిరెడ్డి అన్నారు. 

''చంద్రబాబు నాయుడు 100కి 150 శాతం సమయాన్ని రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచిస్తే... జగన్ రెడ్డి మాత్రం 25 శాతం సమయాన్ని కూడా రాష్ట్రం కోసం కేటాయించడం లేదు. చంద్రబాబు కనీసం 25శాతం సమయాన్ని పార్టీ కోసం కేటాయించి ఉంటే నేడు వైసీపీ పార్టీ ఉండేది కాదు'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''63 శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రాష్ట్రానికి జగన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత తక్కువ ప్రాధానత ఇస్తుంది. 2019-20 బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించి రూ.6వేల కోట్లు వ్యయం చేశారు. 2020-21 పెద్ద మార్పు లేదు'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

''గత ప్రభుత్వాలు అమలు చేసిన పావలా వడ్డీ, సున్నా వడ్డీని చంద్రబాబు నాయుడు కొనసాగించారు. అలాగే టిడిపి హయాంలో వరి సాగులో 2017-18కి గాను దేశంలోనే మొదటి స్థానంలో ఉండటంతో రాష్ట్రానికి కేంద్రం అవార్డు ఇచ్చింది'' అని గుర్తుచేశారు.

read more   మళ్లీ నా అరెస్టుకు కుట్రలు... పంచె, టీషర్ట్ తో సిద్దంగా వున్నా: అచ్చెన్నాయుడు సంచలనం

''పొలం బడిని ఎత్తేశారు, బిందు తుంపర్ల సేద్యాన్ని జగన్ రెడ్డి ఆపేశారు. చంద్రబాబు హయాంలో చేసిన నేచురల్ ఫార్మింగ్ ను దేశం మోడల్ తీసుకుంది. దానిని కూడా జగన్ రెడ్డి నిలిపివేశారు. రైతులకు ఏ కష్టం వచ్చినా చంద్రబాబు ఆదుకున్నారు. జగన్ అలా కాదు'' అని మండిపడ్డారు. 

''రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు యువత మీద ఆధారపడి ఉంది. పోలీసులు చేస్తున్న దాష్టికానికి నిరసనగా ప్రజలందరూ కదలాలి. ప్రజా ఉద్యమంతోనే వైసిపి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి'' అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.