నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధాని మోదీ దాడి తీవ్రం చేసింది.
నిన్నబాలకృష్ణ చాలా తీవ్ర స్థాయిలో,గతంలో ఎవరూ వాడని భాషలో మోదీ దుయ్యబట్టారు. ఈ  రోజు విజయ వాడ ఎంపి కేశినేని నాని కూడా ఇలాగే చేశారు. అంటే, మోదీ మీద పోరాటం ఉధృతం చేసేందుకు టిడిపి పూనుకుందని అర్థమవుతుంది. ఈ రోజు విజయవాడలో నాని సైకిల్ యాత్ర నిర్వహించారు. అక్కడ  మాట్లాడుతూ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పచ్చి మోసం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమ్మక ద్రోహి అన్నారు.  గుజరాత్ కంటే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందడం మోదీకి ఇష్టం లేదని అన్నారు.