Asianet News TeluguAsianet News Telugu

కట్టలు సాయానికి రిటర్న్ గిఫ్ట్ గా గోదావరి జలాలు, ఊసరవెల్లి వేషాలు మానుకో: జగన్ పై లోకేష్ ఫైర్

గోదావరి నది జలాలపై అసెంబ్లీలో జరిగిన రాద్ధాంతాన్ని గుర్తు చేస్తూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూ టర్న్ జగన్! ఈ ఊసరవెల్లి వేషాలు మాని, ఎన్నికల్లో గెలుపు కోసం కట్టల సాయం అందుకున్నాం... అందుకే రిటర్న్ గిఫ్ట్ గా గోదావరి నీటిపై ఆంధ్రా హక్కులు వదులుకుంటున్నాం అని చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. 

tdp general secretory nara lokesh fires on cm ys jagan
Author
Amaravathi, First Published Jul 26, 2019, 7:22 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం జగన్ ను యూటర్న్ సీఎంగా, ఊసరవెల్లి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

గోదావరి నది జలాలపై అసెంబ్లీలో జరిగిన రాద్ధాంతాన్ని గుర్తు చేస్తూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూ టర్న్ జగన్! ఈ ఊసరవెల్లి వేషాలు మాని, ఎన్నికల్లో గెలుపు కోసం కట్టల సాయం అందుకున్నాం... అందుకే రిటర్న్ గిఫ్ట్ గా గోదావరి నీటిపై ఆంధ్రా హక్కులు వదులుకుంటున్నాం అని చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు. 

ఇకపోతే గురువారం అసెంబ్లీలో గోదావరి నది జలాలపై అసెంబ్లీలో వాడీ వేడిగా చర్చ జరిగింది. గోదావరి నది జలాల పంపకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని లేని పక్షంలో నీటి యుద్ధాలు జరిగే అవకాశం ఉందంటూ అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి

రైతుల పంటను బ్యాంకుల వేలం, రెట్టింపు ఆదాయం ఇదేనా: జగన్ పాలనపై లోకేష్ సెటైర్లు

Follow Us:
Download App:
  • android
  • ios