Asianet News TeluguAsianet News Telugu

మరోసారి జనంలోకి నారా లోకేష్: ఇచ్ఛాపురం నుండి శంఖారావం

నారా లోకేష్  మరోసారి జనంలోకి వెళ్లనున్నారు. గతంలో యువగళం పేరుతో  పాదయాత్రను  లోకేష్ నిర్వహించారు. 

TDP General Secretary Nara Lokesh To start  Shakaravam lns
Author
First Published Feb 8, 2024, 5:27 PM IST | Last Updated Feb 8, 2024, 5:27 PM IST

అమరావతి: ఈ నెల  11 వ తేదీ నుండి  శంఖారావం పేరుతో  తెలుగు దేశం పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఎన్నికల ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుండి  లోకేష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 11 రోజుల పాటు  31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుంది.  పార్టీ క్యాడర్ ను  ఎన్నికలకు  కార్యోన్ముఖులను చేయడం కోసం  లోకేష్ ఈ యాత్ర ప్రారంభించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయి వరకు  తీసుకెళ్లడంపై  ప్రచారం చేయనున్నారు. అంతేకాదు టీడీపీ, జనసేన  కూటమి ప్రజలకు ఇస్తున్న హామీలను కూడ ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారు.తెలుగు దేశం పార్టీ  శ్రేణులతో  రోజుకు మూడు విడతలుగా లోకేష్ సమావేశం కానున్నారు.  

also read:బీజేపీ నేతలతో బాబు భేటీ,మరునాడే ఢిల్లీకి జగన్: ఎందుకో తెలుసా?.

2023 జనవరి 27వతేదీన కుప్పం  వరదరాజస్వామి  ఆలయం నుండి   నారా లోకేష్  యువగళం పాదయాత్ర ప్రారంభించారు. విశాఖపట్టణం జిల్లాలో  ఈ యాత్ర ముగిసింది. రాష్ట్రంలోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2197 గ్రామాల మీదుగా యువగళం పాదయాత్ర  సాగింది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం పరిధిలోని అగనంపూడి వద్ద గత ఏడాది డిసెంబర్ 18వతేదీన లోకేష్ యువగళం పాదయాత్రను అనివార్యంగా ముగించారు. 

also ead:రాజ్యసభ ఎన్నికలు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు వీరే

ఈ నెల  11న ఇచ్ఛాపురం,పలాస, టెక్కలి,ఈ నెల  12న నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, ఈ నెల 13న  పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమం జరగనుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios