నామినేషన్ల సందర్భంగా టిడిపి-భాజపాల మధ్య పెద్ద హై డ్రామానే నడిచింది. నామినేషన్ల సమయంలో ఇరు పార్టీల నేతలు ఎవరి వార్డుల్లో వారు నామినేషన్లు వేసారు. ఎప్పుడైతే పొత్తులు కుదిరాయనుకున్నారో వెంటనే తమ నామినేషన్లు ఉపసంహరించాలని భాజపా కోరింది. 23 నామినేషన్లలో 9 వార్డులు పోను కేవలం ఒక్క వార్డులో మాత్రమే పోటీ నామినేషన్ వేసింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మిత్రధర్మానికి తూట్లు పొడిచింది.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మిత్రధర్మానికి తూట్లు పొడిచింది. నామినేషన్ల సందర్భంగా టిడిపి-భాజపాల మధ్య పెద్ద హై డ్రామానే నడిచింది. భాజపా 26 వార్డులడిగితే టిడిపి 9 వార్డులు మాత్రమే కేటాయిస్తానంటూ స్పష్టం చేసింది. ఈ సందర్భంగానే రెండు మూడు రోజుల పాటు రెండు పార్టీల్లోనూ హడావుడి జరిగింది. సరే, తెరవెనుక ఏం జరిగిందో కానీ భాజపా 9 వార్డులతో సరిపెట్టుకుంది.
నామినేషన్ల సమయంలో ఇరు పార్టీల నేతలు ఎవరి వార్డుల్లో వారు నామినేషన్లు వేసారు. ఎప్పుడైతే పొత్తులు కుదిరాయనుకున్నారో వెంటనే తమ నామినేషన్లు ఉపసంహరించాలని భాజపా కోరింది. అప్పటికే భాజపా కూడా 23 వార్డుల్లో నామినేషన్లు వేసింది.
అయితే పోత్తులో భాగంగా తనకు కేటాయించిన 9 వార్డులను ఉంచుకున్నది. కాకపోతే ముందుజాగ్రత్తగా వేసిన 23 నామినేషన్లలో 9 వార్డులు పోను కేవలం ఒక్క వార్డులో మాత్రమే పోటీ నామినేషన్ వేసింది. అదేసమయంలో టిడిపి మాత్రం తన వార్డులతో పాటు భాజపాకు కేటాయించిన వార్డుల్లో కూడా నామినేషన్లను వేసేసింది. పైగా ఎక్కడా ఉపసంహరించుకోలేదు కూడా.
టిడిపి తీరుతో భాజపా నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయమై భాజపా నేతలు కేంద్ర నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేసారు. భాజపా శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ, తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేయటం గమనార్హం.
నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా పూర్తయినందున తమ వార్డుల్లో పోటీ నామినేషన్లు వేసిన టిడిపి నేతల విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు. సమస్యను తమ పార్టీ టిడిపి నేతల దృష్టికి తీసుకెళ్ళినట్లు కూడా చెప్పారు. అంతకన్నా రాజుగారు మాత్రం ఏం చేయగలరు? మిత్రధర్మం ముసుగులో టిడిపి చేస్తున్న అన్యాయాన్ని మాత్రం భాజపా గట్టిగా నిలదీసే స్ధితిలో మాత్రం లేదు.
