Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలో చేరిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. అనర్హత వేయండి : స్పీకర్‌కు తెలుగుదేశం ఫిర్యాదు

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ .. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది.

tdp files disqualification petition against four mlas who join in ysrcp ksp
Author
First Published Jan 12, 2024, 8:50 PM IST

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ .. స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్‌లపై అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి పిటిషన్ ఇచ్చారు టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష విప్ బాలవీరాంజనేయస్వామి పేరుతో పిటిషన్ అందజేశారు. ఇప్పటికే వైసీపీలో గెలిచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అదే బాటలో టీడీపీ కూడా నడుస్తూ వుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మరి ఈ రెండు పిటిషన్‌లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios