టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు అనారోగ్యంతో కన్నుమూశారు. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. బుధవారం పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

కాగా.. అన్నపూర్ణమ్మ మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యే గా, పార్టీ నేతగా ఆమె చేసిన సేవలను ఇతర నేతలు ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు. అన్నపూర్ణమ్మ అంత్యక్రియలు...ఆమె స్వగ్రామంలో గురువారం జరగనున్నాయి.