ప్రలోబాలకు కేరాఫ్ టిడిపి నంద్యాల బాబుకు ఆనాడు కనిపించలేదు, కానీ ఉప ఎన్నీకల ముందు మాత్రం అందరు ఇక్కడ తిష్ట వేశారు. జగన్ కోసం నంద్యాల ప్రజల కోసం కష్టపడుతాం.


ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌లోభాలు పెట్టి రాజ‌కీయాలు చేస్తార‌ని ఆరోపించారు శిల్పా మోహ‌న్ రెడ్డి. వైసీపి భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. 

2019 లో జ‌గ‌న్ సీఎం అయ్యాక నంద్యాల‌ను ప్ర‌త్యేక జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని శిల్పామోహన్ రెడ్డి కొరారు. వైసీపిని త‌ట్టుకోలేక‌ అఖిల ప్రియా, సుబ్బారెడ్డి క‌లిసి సాక్షీ టీవి ప్ర‌సారాల‌ను నిలిపివేశార‌ని ఆయ‌న ఆరోపించారు. తాను మూడున్న‌ర స‌ంవత్స‌రాలు టిడిపిలో ఉన్న నంద్యాల‌కు ఎలాంటి అభివృద్ది జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. గ‌తంలో తాను రోడ్ల విస్తీర్ణ‌కు బాబును నిథులు అడిగితే ఇవ్వ‌లేదు, కానీ ఇప్పుడు ఉప ఎన్నీక‌ల‌కు ముందు మాత్రం డ‌బ్బులు ఎక్క‌డి నుండి వ‌చ్చాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ‌ పై టిడిపి విష ప్ర‌చారం చేస్తుంద‌ని, ముస్లీంల‌ను అడ్డు పెట్టుకొని ఘ‌ర్ష‌ణ‌ల‌ను రెచ్చ‌గొడుతుంద‌ని ఆయ‌న టిడిపి పైన ధ్వ‌జ‌మెత్తారు. ముస్లీంల‌ను మేము ఎప్పుడు అగౌవ‌ర‌ప‌ర్చ‌లేదని వాళ్లంటే త‌మ‌కు ప్ర‌త్యేక‌మైనా అభిమానం ఉంద‌ని తెలిపారు.

భ‌విష‌త్తులో త‌మ‌కు ఎన్నీ ఇబ్బందులు వ‌చ్చిన సోద‌రులం ఇద్ద‌రం జ‌గ‌న్ కు అండ‌గా నిల‌బ‌డుతామ‌ని, త‌మ‌ ఉపిరి ఉన్నంత వ‌ర‌కు నంద్యాల అభివృద్ది కోసం క‌ష్ట‌ప‌డుతామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పెర్కోన్నారు.