ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా గెలుపు మాత్రం వైసీపిదే. టీడీపీ నేతలు చేసిన తప్పులన్నీ వైసీపి పై రుద్దేందుకు ప్రయత్నం. మంత్రులు డ‌బ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ఆరోపణ.

అధికార పార్టి నంద్యాల ఉప ఎన్నిక‌లో ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా గెలుపు మాత్రం త‌మ‌దే అని ధీమా వ్య‌క్తం చేశారు వైసీపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ నేతలు చేసిన తప్పులన్నీ వైసీపి పై రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయ‌న‌ ధ్వజమెత్తారు. నంద్యాల ప్ర‌చారంలో మంత్రులు డ‌బ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. సోమ‌వారం ఆయ‌న మీడియతో మాట్లాడుతూ అధికార పార్టి అరాచాకాలు చేస్తుందంటూ విరుచుకుప‌డ్డారు.

 నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో 20 వేల మెజార్టీతో శిల్పామోహాన్ రెడ్డి గెలుపు తథ్యమ‌ని జ్యోస్యం చెప్పారు పెద్దిరెడ్డి. ప్ర‌ధాని కొత్త నోట్లు తెచ్చింది టీడీపీ కోస‌మే అనిపిస్తుందని ఆయ‌న అన్నారు. టీడీపీ నేత‌లందరూ జేబుల్లో రూ.2 వేల నోట్ల కట్టలను తీసుకెళ్లి మ‌రీ పంచుతున్నార‌ని ఆరోపించారు. తాము మహిళలకు బొట్టుపిల్లల ప్యాకెట్లు ఇస్తేనే పచ్చ పత్రికల్లో వైసీపి డబ్బులు పంచుతోందని బ్రేకింగ్‌లు న‌డిపిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

నంద్యాల్లో టీడీపీ దౌర్జ‌న్యాలు చేస్తూ ఎల‌గైనా గెలవాలని ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయ‌న తెలిపారు. శిల్పామోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను చెడగొట్టేందుకు చంద్ర‌బాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. శిల్పా టీడీపీలో ఉన్నంత కాలంలో మంచివాడ‌న్న‌ బాబు పార్టీ వీడిన తరువాత ఫ్యాక్షనిస్టు అని విమ‌ర్శించ‌డం పెద్ద జోక్‌గా పెర్కొన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి గురించి నంద్యాల ప్రజలందరికీ బాగా తెలుసునన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా శిల్పా విజ‌యాన్ని అడ్డుకోలేర‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 

మరిన్ని తాజా వార్తా విశేషాలకోసం క్లిక్ చేయండి.

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్
<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యకు పౌరసన్మానం ఫోటో గ్యాలరీ