అమరావతి:వచ్చే ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేయనున్నట్టు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. 

శనివారం నాడు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చర్చించారు. సమావేశం తర్వాత మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి  మీడియాతో మాట్లాడారు.

ఈవీఎంలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నట్టు ఆయన చెప్పారు. బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయనున్నట్టు సుజనా తెలిపారు.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టకుండా పుల్ బడ్జెట్ పెట్టాలని చూస్తోందని సుజనా చౌదరి ఆరోపించారు.ఎన్నికలకు ముందు పుల్ బడ్జెట్ పెట్టడం సరైందికాదన్నారు. ఎన్డీఏలో బీజేపీ ఒక్కటి మాత్రమే మిగిలిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో 10 ప్రాంతాల్లో సభలు పెట్టాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన తెలిపారు.