Asianet News TeluguAsianet News Telugu

టిడిపినే లక్ష్మీ స్ ఎన్టీఆర్ కు ప్రచారం కల్పిస్తోంది

  • లక్ష్మీస్ ఎన్టీఆర్ కు విపరీతమైన ప్రచారం వచ్చేస్తోంది.
  • ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటన చేసినప్పటి నుండి టిడిపి నేతల నుండే విపరీతమైన వివాదాలు ముసురుకుంటున్నాయ్.
  • అసలు సినిమా ఎప్పుడు తీస్తాడో తెలీదు, నటీ నటులు ఎవరో తెలీదు?
  • ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలవుతుందో ఎవరు చెప్పలేరు.
  • కానీ షూటింగే మొదలుకాని సినిమాకు మంత్రి సోమిరెడ్డి లాంటి వాళ్ళ వల్ల విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
Tdp creating hype for varmas latest movie Lakshmis NTR

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు విపరీతమైన ప్రచారం వచ్చేస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటన చేసినప్పటి నుండి టిడిపి నేతల నుండే విపరీతమైన వివాదాలు ముసురుకుంటున్నాయ్. అసలు సినిమా ఎప్పుడు తీస్తాడో తెలీదు, నటీ నటులు ఎవరో తెలీదు? ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలవుతుందో ఎవరు చెప్పలేరు. కానీ షూటింగే మొదలుకాని సినిమాకు మంత్రి సోమిరెడ్డి లాంటి వాళ్ళ వల్ల విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

ఈ మొత్తానికి కారణం రాజకీయ నేపధ్యమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా నటుడే అయినప్పటికీ రాజకీయాల్లోకి దిగి టిడిపి పెట్టిన దగ్గర నుండి అనేక వివాదాలకు కేంద్రబిందువయ్యారు. 1994 ఎన్నికలకు ముందు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవటమే ఎన్టీఆర్ జీవితంలో అతిపెద్ద మలుపు. ప్రస్తుతం దానిచుట్టూనే వివాదాలు తిరుగుతున్నాయ్. లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవటం, తర్వాత ఎన్నికల్లో ముఖ్యమంత్రవ్వటం, వెంటనే చంద్రబాబునాయుడు అండ్ కో పార్టీలో తిరుగుబాటు లేవదీసి సిఎంగా ఎన్టీఆర్ ను దింపేయటం అందరికీ తెలిసిందే.

సినిమా నటుడిగా ఎన్టీఆర్ జీవితంలో ఎటువంటి వివాదాలు లేవు. రాజకీయాల్లోకి అడుగుపెట్టినపుడు కూడా వివాదమేమీ లేదు. ఎన్టీఆర్ జీవితంలో ఏమైనా వివాదముందా అంటే 1993 సెప్టెంబర్ లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుంటానని ప్రకటన చేసిన తర్వాతే మొదలైంది. వర్మ కూడా ఆ వివాదాన్ని బేస్ చేసుకునే సినిమా తీసే ఉద్దేశ్యంలో ఉన్నట్లున్నారు. వివాదాస్పద అంశాలను ముట్టుకోకపోతే ఆయన వర్మ ఎందుకవుతారు?

అటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు తాజాగా మంత్రి సోమిరెడ్డి బాగా ప్రచారం కల్పిస్తున్నట్లున్నారు. వర్మ తీయబోయే సినిమాలో లక్ష్మీ పార్వతినే హీరోయిన్ గా పెట్టుకోవాలని సంచలన ప్రకటన చేసారు సోమిరెడ్డి. వర్మ కూడా ఏమీ తక్కువ తినలేదు.  ‘లక్ష్మీ పార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా’  అంటూ రిటార్ట్ ఇచ్చారు. సోమిరెడ్డి రాజేసిన వివాదం ఇక్కడితో ఆగేలా లేదు చూడబోతే. సినిమా మొదలయ్యేలోగా ఇంకెన్ని వివాదాలు చూడాలో ఏంటో ? వివాదం ముదిరితే నష్టం టిడిపికే కానీ వర్మకు ఏమీ లేదన్న విషయం టిడిపి నేతలు గ్రహించాలి.  ఎందుకంటే, వివాదాలు మదరటమే వర్మ కు కావాల్సింది.  

Follow Us:
Download App:
  • android
  • ios