ఇంతకాలం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటానికి వైసీపీ అమలు చేసిన కార్యక్రమానికి విరుద్దమన్నమాట. ప్రభుత్వ వైఫల్యాలను ‘గడపగడపకు వైసీపీ’ పేరుతో ప్రతిపక్షం ఎండగడితే, తాను అమలు చేస్తున్న పథకాలకు సొంతడబ్బా కొట్టుకునేందుకు టిడిపి ‘ఇంటింటికి టిడిపి’ ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాపీ కొట్టటం సహజం. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఓ పథకం విషయంలో ప్రతిపక్ష వైసీపీని అధికార టిడిపి కాపీ కొడుతోంది. అదే ‘ఇంటింటికి టిడిపి’ అనే పథకం. ఈరోజు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమన్వయ కమిటి సమావేశం జరిగింది.
ఆ సందర్భంగా మంత్రులు, నేతల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసారట. తాను పార్టీ, ప్రభుత్వం కోసం ఎంత కష్టపడుతున్నదీ సుదీర్ఘంగా వివరించి చెప్పారట. సరే, పార్టీ కోసంగానీ ప్రభుత్వంలో గానీ తాను మాత్రమే కష్టపడుతున్నానని చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటే కదా? లేదు.. ‘తాము కూడా కష్టపడుతున్నామ’ని తమ్ముళ్ళు చెప్పనుగాక చెప్పుకోలేరు కదా?
సరే, షరామామూలుగానే సమన్వయ కమిటి సమావేశంలో కూడా జరిగిందదే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి చెప్పటంలో పార్టీ నేతలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా విఫలమైవుతోందంటూ చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేసారట. అందుకనే పార్టీ, ప్రభుత్వ యంత్రాగానికి 60 రోజుల కార్యక్రమాన్ని రూపొందించారట.
సెప్టెంబర్ 1వ తేదీ నుండి అక్టోబర్ 30 వరకూ ‘ఇంటింటికి టిడిపి’ అనే పథకాన్ని సిద్ధం చేసారట. ఈ పథకం పేరు వినగానే వైసీపీ అమలు చేసిన ‘గడపగడపకు వైసీపీ’ అనే పథకం గుర్తుకు వస్తే అది జనాలు తప్పుకాదులేండి.
అంటే ఇంతకాలం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటానికి వైసీపీ అమలు చేసిన పథకానికి విరుద్దమన్నమాట. ప్రభుత్వ వైఫల్యాలను ‘గడపగడపకు వైసీపీ’ పేరుతో ప్రతిపక్షం ఎండగడితే, తాను అమలు చేస్తున్న పథకాలకు సొంతడబ్బా కొట్టుకునేందుకు టిడిపి ‘ఇంటింటికి టిడిపి’ ని అమలు చేయాలని నిర్ణయించింది.
