Asianet News TeluguAsianet News Telugu

ఫలితాల తారుమారుకు ఈ పోలీసులే కారణం: పేర్లతో సహా ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

 గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైకాపా బలపరిచిన అభ్యర్థులకు ఫలితాలను అనుకూలంగా చేసుకునేందుకు డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గనా రాజేంద్రనాథ్ రెడ్డి కొంతమంది పోలీసులను ప్రభావితం చేశారని చంద్రబాబు ఆరోపించారు. 

tdp chief complains sec against done police offices
Author
Amaravathi, First Published Feb 18, 2021, 12:22 PM IST

కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు ఆరోపించారు. బుధవారం మూడో విడత ఎన్నికల్లో భాగంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ పోలింగ్ జరిగిందని... అయితే పలుచోట్ల ఫలితాల తారుమారు చేయడానికి వైసిపి ప్రయత్నిస్తోందంటూ చంద్రబాబు ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. 

''డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితాలు నిలిపివేయబడ్డాయి. అనేక రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి వైసీపీ మద్దతు ఉన్న అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలను ప్రకటించారు. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైకాపా బలపరిచిన అభ్యర్థులకు ఫలితాలను అనుకూలంగా చేసుకునేందుకు డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గనా రాజేంద్రనాథ్ రెడ్డి కొంతమంది పోలీసులను ప్రభావితం చేశారు'' అని చంద్రబాబు ఆరోపించారు. 

read more   గ్రామ పంచాయతీ ఎన్నికలు: కుప్పంలో చంద్రబాబుకు షాక్

 అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకు  ఏకపక్షంగా సహకరించారంంటూ కొందరు పోలీసు అధికారుల పేర్లను చంద్రబాబు ఎస్ఈసికి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  డోన్ అసెంబ్లీ విభాగంలో పోలీసుల అధికార దుర్వినియోగంపై విచారణ జరపాలని... తప్పు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఎస్ఈసిని కోరారు. 

చంద్రబాబు ఫిర్యాదులో పేర్కొన్న పేర్లు: 

1. నర్సింహ రెడ్డి డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్, డోన్
2. మహేశ్వర రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్, డోన్ రూరల్
3. సుబ్రమణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్, డోన్ టౌన్
4. ప్రియతం రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్, డోన్ రూరల్
5. రామలింగం సర్కిల్ ఇన్స్పెక్టర్, పీప్పలి
6. మిస్టర్ మారుతి శంకర్ సబ్ ఇన్స్పెక్టర్, పీపల్లి
7. శ్రీధర్ సబ్ ఇన్స్పెక్టర్, జలదుర్గం
8. కేశవ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్, బేతంచెర్ల మండలం
9. సురేష్ సబ్ ఇన్స్పెక్టర్, బేతంచెర్ల మండలం

 పోలీసుల తమ విధులలో అత్యుత్సాహం ప్రదర్శించడమే కాకుండా కౌంటింగ్ కేంద్రాలను తమ గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపింంచారు.  రీకౌంటింగ్ పేరిట పాలక వైసీపీ మద్దతు అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారుని చంద్రబాబు మండిపడ్డారు. 

'' గ్రామ పంచాయతీలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అవకతవకలకు పాల్పడి ఫలితాలను అనుకూలంగా మార్చుకున్నారు. కర్నూలు జిల్లా డోన్ గ్రామీణ మండలం, ఎద్దుపెంట గ్రామం, చింతలపేట గ్రామం, ఆవులదొడ్డి గ్రామాలలో, పీప్పలి మండలం, చంద్రపల్లి, బావిపల్లి గ్రామాలలో వైసీపీ బలపరిచిన అభ్యర్ధులు ఓడిపోయినప్పటికీ గెలిచినట్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో, లెక్కింపు ప్రక్రియపై విచారణ చేసి నిజమైన విజేతలను విజేత అభ్యర్థిగా ప్రకటించాలని అభ్యర్థిస్తున్నాను. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసి) ఈ అవకతవకలపై తక్షణం స్పందిచడం వలన క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది'' అని చంద్రబాబు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios