Asianet News TeluguAsianet News Telugu

ఇంకా కక్ష తీరలేదా.. అచ్చెన్నాయుడు డిశ్చార్జిని ఖండించిన చంద్రబాబు

మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌ని ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం వరుస ట్వీట్ల ద్వారా స్పందించిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు

tdp chief chandrababu reacts on achamnaidus discharge
Author
Amaravathi, First Published Jul 1, 2020, 11:25 PM IST

మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు డిశ్చార్జ్‌ని ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం వరుస ట్వీట్ల ద్వారా స్పందించిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్ట్ లో ప్రభుత్వం అడుగడుగునా అమానవీయంగా వ్యవహరించి, ఆయనకు రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైంది. ఇంకా కక్షతీరలేదన్నట్టు, ఆయన్ను ఉన్నట్టుండి డిశ్చార్జ్ చేయించి డాక్టర్స్ డే రోజున ప్రభుత్వం మరో దుర్మార్గానికి పాల్పడిందన్నారు.

డిశ్చార్జ్ చేయడంలో కూడా కనీస నిబంధనలు పాటించరా? సాయంత్రం 5 గంటల  తర్వాత డిశ్చార్జ్ చేస్తూ,  4.20 గం.ల సమయం వేయడం ఏంటి? కమిటీ ముసుగులో, తప్పుడు నివేదికలతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

చికిత్స పొందాల్సిన వ్యక్తిని వీల్ చైర్ లో కూర్చోబెట్టి, అంబులెన్సులో జైలుకు తీసుకువెళ్ళడం వెనుక... అచ్చెన్నాయుడును ఒక్కరోజైనా జైల్లో ఉంచాలనే మీ సైకో మనస్తత్వం కనపడుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios