అవిశ్వాసంపై కసరత్తు:18 పార్టీలకు లేఖలు రాసిన చంద్రబాబు

Tdp chief Chandrababu Naidu writes letter to 18 parties seeking support no confidence motion
Highlights

అవిశ్వాసానికి మద్దతివ్వాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  18 పార్టీలకు లేఖలు రాశాడు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై  చంద్రబాబునాయుడు ఆ లేఖలో వివరించారు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని చంద్రబాబునాయుడు కోరారు.

అమరావతి: అవిశ్వాసానికి మద్దతివ్వాలని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  18 పార్టీలకు లేఖలు రాశాడు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై  చంద్రబాబునాయుడు ఆ లేఖలో వివరించారు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని చంద్రబాబునాయుడు కోరారు.

కేంద్రంపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాసంపై  శుక్రవారం నాడు లోక్‌సభలో చర్చ జరగనుంది. జూలై 20వ తేదీన ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు  అవిశ్వాసంపై చర్చ జరగనుంది.

అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా  ఓటు వేయాలని చంద్రబాబునాయుడు 18 పార్టీలకు లేఖలు రాశారు.   ఎన్నికల ముందు  బీజేపీ ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలు ఏ రకంగా ఈ హమీలను  కేంద్రం విస్మరించిందనే విషయాలను చంద్రబాబునాయుడు ఆ లేఖలో ప్రస్తావించారు.

బీజేపీ  చేసిన అన్యాయాన్ని ఎండగట్టేందుకే  తాము అవిశ్వాసాన్ని ప్రతిపాదించినట్టుగా  చంద్రబాబునాయుడు ఆ లేఖలో ప్రస్తావించారు.  కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతుగా నిలవాలని చంద్రబాబునాయుడు ఆ లేఖలో కోరారు. 

తమ అవిశ్వాసానికి మద్దతుగా బాబు రాసిన  లేఖలను  18 పార్టీలకు టీడీపీ ఎంపీలు  అందించారు. అవిశ్వాసం సందర్భంగా ఓటింగ్ జరిగితే కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని  టీడీపీ ఎంపీలు  18 పార్టీల ఎంపీలను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడ  ఈ మేరకు  అవిశ్వాసానికి  మద్దతును కూడగడుతోంది. బీజేపీయేతర పార్టీలను అవిశ్వాసానికి మద్దతుగా రావాలని కోరుతోంది.

ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రచురించిన  పుస్తకాన్ని కూడ చంద్రబాబునాయుడు ఆ లేఖతో పాటు  18 పార్టీలకు అందించారు. అవిశ్వాస తీర్మాణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని బాబు ఆ లేఖలో కోరారు.

loader