ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తన మీద, టీడీపీపైన ఎంత కక్ష ఉందో చెప్పడానికి వైసీపీ వేసిన సిట్ ఉదాహరణ అన్నారు. 9 నెలల్లో 3 సిట్‌లు.. ఆరు కమిటీలు వేశారని టీడీపీని కాదు.. ఏకంగా ఏపీని టార్గెట్ చేశారని ఆయన మండిపడ్డారు.

Also Read:వైఎస్ ఎన్నో ఎంక్వైరీలు వేసి ఏం సాధించారు.. ఇప్పుడు అంతే: సిట్‌పై లోకేశ్ వ్యాఖ్యలు

వైసీపీ అధికారంలోకి వస్తూనే తవ్వండి.. తవ్వండి అన్నారని, తవ్వితే సన్మానాలు చేస్తామని అధికారులను బతిమిలాడుకున్నారంటూ టీడీపీ చీఫ్ గుర్తుచేవారు. 8 నెలల క్రితమే కేబినెట్ సబ్ కమిటీ వేసి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడటం, కంపెనీలను తరిమేయడం తప్పించి ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు.

కొత్తగా వేసిన సిట్ వల్ల కక్ష సాధింపు తప్పించి ప్రజలకు కలిగే ఉపయోగమేంటో చెప్పాలని ప్రతిపక్షనేత ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తనపై 26 విచారణలు వేయించినా ఏమీ నిరూపించలేకపోయారని చంద్రబాబు గుర్తుచేశారు.

Also Read:నా పేరు ఎక్కడా లేదు, ఏ విచారణకైనా సిద్ధం: ఈఎస్ఐ స్కామ్ పై పితాని

ఇప్పుడూ అదే జరుగుతుందని, ప్రభుత్వ వేధింపులకు 344 జీవోనే నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులపై కక్ష సాధించడమే వైసీపీ ప్రభుత్వం అజెండాగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలు ఎప్పుడూ తప్పుచేయలేదని.. వైసీపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు.