రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్‌లోని డాక్టర్‌తో చికిత్స చేయించి పెద్ద మనసు చాటుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పెద్ద మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు చంద్రబాబు తన కాన్వాయ్‌లోని డాక్టర్‌తో చికిత్స చేయించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం పై నుంచి పడిపోయి గాయాలతో బాధపడుతుండటాన్ని గమనించారు.
వెంటనే ఆయన కాన్వాయ్ ఆపించి కిందకి దాగి వారిని పరామర్శించారు. వెంటనే తన కాన్వాయ్‌లో వున్న డాక్టర్‌ను పిలిపించి చికిత్స చేయించారు. అనంతరం బాధిత మహిళలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆపై కాన్వాయ్‌లోని ఒక కారులో బాధితులను వారి ఇంటి దగ్గర దిగిపెట్టారు. అనంతరం వారికి కావాల్సిన మందులను అందజేయాల్సిందిగా సిబ్బందిని చంద్రబాబు ఆదేశించి ఆయన పార్టీ ఆఫీసుకు బయల్దేరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALso Read: సైకో జగన్ ముద్దులు కాస్తా గుద్దులుగా మారాయి..: టిడిపి అనిత
కాగా.. కాలకేయుడిగా మారిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహాశక్తి గద్దె దింపుతుందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఎన్నికల సమయంలో మహిళల ఓట్ల కోసం జగన్ పెట్టిన ముద్దులు అదికారంలోకి వచ్చా గుద్దులుగా మారాయన్నారు. ఈ వైసిపి పాలనలో మహిళాలోకం దగాపడిందని... సైకో జగన్ ఎప్పుడు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతాడా అని ఎదురుచూస్తున్నారని అనిత పేర్కొన్నారు.
మంగళగిరిలోని టిడిపి జాతీయ కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మహిళా నాయకుల కోసం ఏర్పాటుచేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మహిళల కోసం టిడిపి మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని వివరించేందుకు మహాశక్తి చైతన్య రథయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారని... మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఈ హామీ ఇంకా నెరవేరలేదని అన్నారు. మద్యం ఆదాయాన్ని చూపించి మహిళల మాంగల్యాలను 25 వేల కోట్లకు జగన్ తాకట్టుపెట్టాడని ఆరోపించారు. సీఎం నిర్ణయాలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని అనిత అన్నారు.
అసలు తెలుగు మహిళా శక్తిని బయటకు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్, టీడీపీదే అని అనిత అన్నారు. కుటుంబ ఆస్తిలో కొడుకులతో సమానంగా ఆడబిడ్డలకు కూడా హక్కు కల్పించిన ఘనత తమ పార్టీదని అన్నారు. ఇప్పుడు వైసీపీ మహిళా నేతలు వారి తండ్రి ఆస్తిలో సమానవాటా తీసుకుంటున్నారంటే అది టీడీపీ పెట్టిన భిక్షేనని అనిత పేర్కొన్నారు. మహిళల స్వయం శక్తితో బ్రతికేలా కృషిచేసిన ఘనత చంద్రబాబుది అని అనిత అన్నారు.
