చలో విజయవాడ (chalo vijayawada) కార్యక్రమంపై స్పందించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . ఉద్యోగుల నిరసనలపై జగన్ (ys jagan) ప్రభుత్వ నియంతృత్వ తీరును ఆయన ఖండించారు.  లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా...ఆలోచనతో స్పందించాలని, ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. 

చలో విజయవాడ (chalo vijayawada) కార్యక్రమంపై స్పందించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . ఉద్యోగుల నిరసనలపై జగన్ (ys jagan) ప్రభుత్వ నియంతృత్వ తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా.. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం రివర్స్ పిఆర్సిని (prc) వెనక్కి తీసుకోవాలి.....నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా...ఆలోచనతో స్పందించాలని, ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. 

ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా...రాష్ట్రంలో భాగస్వాములు కాదా, రాజకీయ పక్షాలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ‌ నిర్భంధాలు సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయంటూ ఆయన దుయ్యబట్టారు. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం... విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. మాయమాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్....ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు. 

ఉద్యోగుల‌ను అగౌర‌ప‌రిచే...ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తీసే విధానాన్ని జ‌గ‌న్ ఇప్ప‌టికైనా వీడాలని చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని.. జగన్ సర్కార్ లా ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 

అంతకుముందు PRC జీవోలను వెనక్కి తీసుకొనేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని Employee Union సంఘాల నేతలు తేల్చి చెప్పారు విజయవాడ .BRTS రోడ్డుపై బైఠాయించి ఉద్యోగులు ఆందోళన చేశారు. మారు వేషాల్లో ఉద్యోగులు విజయవాడకు చేరుకొన్నారు. NGO భవన్ వద్దకు పీఆర్సీ సాధన సమితి నేతలు రాగానే అరెస్ట్ చేయాలని పోలీసులు భారీగా మోహరించారు. అయితే పీఆర్సీ సాధన సమితి నేతలు బైకులపై బీఆర్‌టీఎస్ రోడ్డుకు చేరుకొన్నారు.

ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. . పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడుSuryanarayana మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Buggana Rajendranath Reddy పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు.పీఆర్సీ అంశం వారం రోజుల్లో తేల్చేస్తానన్న ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy చాలా వారాల సమయం తీసుకున్నారని విమర్శించారు.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందన్నారు. నలుగురు ఉద్యోగ సంఘాల నేతలమధ్య గాలి కూడా చొరబడకుండా జాగ్రత్తగా ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యోగులందరికీ తాము నలుగురం అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఛలో విజయవాడను సక్సెస్ చేసి ఉద్యోగులు తమ సత్తా చాటారని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు.