Asianet News TeluguAsianet News Telugu

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, అమరావతిపై జగన్ మడమ తిప్పారు: తిరుపతిలో చంద్రబాబు

అమరావతి రైతులు (amaravathi farmers) అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని.. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా రాజధానిపై ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు

tdp chief chandrababu naidu slams ap cm ys jagan in amaravathi farmers meeting in tirupathi
Author
Tirupati, First Published Dec 17, 2021, 6:27 PM IST

అమరావతి రైతులు (amaravathi farmers) అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). తిరుపతిలో (tirupathi) జరిగిన అమరావతి రైతుల బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజధాని రైతులు, మహిళల పోరాటానికి అభినందనలు తెలియజేశారు. రాజధాని రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆయన మండిపడ్డారు. జగన్ రెడ్డిది (ys jagan mohan reddy) చేతకాని అసమర్ధ ప్రభుత్వమని.. మహాపాదయాత్రలో పాల్గొన్న వారిపైనా కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీపీఐ, సీపీఎం కూడా అమరావతికి మద్ధతు పలికాయని..  అసెంబ్లీ సాక్షిగా జగన్ అమరావతికి మద్ధతు పలికారని చంద్రబాబు గుర్తుచేశారు. తర్వాత అమరావతిపై మడమ  తిప్పారంటూ దుయ్యబట్టారు. అమరావతి రాజధాని ఏ ఒక్కరికో చెందినది కాదని.. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా రాజధానిపై ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న తిరుపతిలో ర్యాలీకి విద్యార్ధుల్ని బలవంతంగా తీసుకొచ్చారని.. రాజధానిపై జగన్‌కు కక్ష ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. 

ALso Read:Nara Lokesh | జగన్ పాలన నియంత పాలనకు నిదర్శనం: నారా లోకేష్

అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి దాదాపు 180 మంది చనిపోయారని.. వేల సంఖ్యలో కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. ఒక్క పాదయాత్రలోనే 2,500 మందిపై వందకు పైగా కేసులు పెట్టారని... ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఇదంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. 2014లో రైతులందరూ ఆలోచించి రాజధాని కోసం పంట భూములు ఇచ్చారని.. హైదరాబాద్‌ అనుభవం ఉందని చెప్పి భూములు తీసుకున్నామని ఆయన  గుర్తుచేశారు. 

హైదరాబాద్‌ కంటే గట్టి నేల అని చెన్నై ఐఐటీ నిపుణులు తేల్చారని.. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని అపోహలు సృష్టించారని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఆయన వెల్లడించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు .. అమరావతి రైతుల భూముల్లోనే ఉన్నాయి. రాజధానికి నిధులు లేవని జగన్‌ అంటున్నారని.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అమరావతిని అభివృద్ధి చేయొచ్చని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి భూములతోనే ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చని.. అమరావతిపై ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన  తెలిపారు..

Follow Us:
Download App:
  • android
  • ios