Asianet News TeluguAsianet News Telugu

కులాల మధ్య చిచ్చు పెట్టే యత్నం.. రామకుప్పంలో విగ్రహాల వివాదంపై బాబు స్పందన

చిత్తూరు జిల్లా (chittoor district) రామకుప్పంలో (rama kuppam) విగ్రహాల ఏర్పాటు వ్యవహారం రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఖండించారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం పక్కనే... వివాదం సృష్టించేలా మరో విగ్రహం పెడతాం అనడం సరికాదన్నారు.

tdp chief chandrababu naidu reacts rama kuppam statues issue
Author
Ramakuppam, First Published Jan 2, 2022, 9:50 PM IST

చిత్తూరు జిల్లా (chittoor district) రామకుప్పంలో (rama kuppam) విగ్రహాల ఏర్పాటు వ్యవహారం రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమైన సంగతి తెలిసిందే. గత నెల 22వ తేదీన తొలగించిన అంబేద్కర్ స్థూపం (dr br ambedkar) వద్దే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం (uyyalawada narasimha reddy) ఏర్పాటు చేసేందుకు ఒక వర్గం ప్రయత్నించడంతో రామకుప్పంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే, ఎస్సీ సంఘాలు, మరో వర్గం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి.

రామకుప్పంలో సమావేశమైన రెడ్డి సంఘం ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం చోటనే ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటుకు దిమ్మె నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీలకు, రెడ్డి సంఘం ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక వర్గానికి చెందిన జేసీబీపై రాళ్ళ దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. లాఠీఛార్జీ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు.

ALso Read:నా నియోజవకర్గంలోనే ఇంత దౌర్జన్యమా..: వైసిపి తీరుపై చంద్రబాబు సీరియస్

మరోవైపు ఈ ఘటనను టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఖండించారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం పక్కనే... వివాదం సృష్టించేలా మరో విగ్రహం పెడతాం అనడం సరికాదన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం కోసం ఓ వర్గం ర్యాలీ చేసి ఉద్రిక్తతలు సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం ఉన్న దగ్గరే...పంతం కోసం ఉయ్యాలవాడ విగ్రహం పెడతామన్న ఆలోచనను విరమించుకోవాలని ఆయన హితవు పలికారు. దళిత సంఘాలు రోడ్డెక్కే వరకు అధికారులు ఏమి చేస్తున్నారు... ఇప్పటికే ఈ అంశంపై ఉన్న ఫిర్యాదును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 

కులాల మధ్య చిచ్చు పెట్టె చర్యలు మంచిది కాదన్న ఆయన... దళిత సంఘాల ఆందోళనను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా కులాల కుంపటి రాజేసే సంస్కృతికి ప్రభుత్వ పెద్దలు వైఖరే కారణమని ఆయన ఆరోపించారు. ఓ వర్గం ఆధిపత్యం కోసం దళితుల మనోభావాలు దెబ్బతీయడం సరి కాదనిన చంద్రబాబు హితవు పలికారు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు నివారించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios