ఏడు నెలల పాలన, జనం ముఖాల్లో చిరునవ్వు కరువు: జగన్‌పై బాబు వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రజలు గత 7 నెలలుగా ఏ పండుగ జరుపుకోవడం లేదన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సోమవారం వెంకటపాలెంలో చనిపోయిన రైతు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు.
రాష్ట్ర ప్రజలు గత 7 నెలలుగా ఏ పండుగ జరుపుకోవడం లేదన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సోమవారం వెంకటపాలెంలో చనిపోయిన రైతు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజధానిలో ఎవరి ముఖంలోనూ చిరునవ్వు లేదని.. ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయాలని చూస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని బాబు హెచ్చరించారు. ప్రజలకు అండగా తానుంటానని.. పోలీసులు ఏం చేస్తారో చూస్తానని ప్రతిపక్షనేత వెల్లడించారు.
Also Read:20 నుంచే విశాఖలో కార్యకలాపాలు: సచివాలయ తరలింపుకు ఏర్పాట్లు, రిపబ్లిక్ డే పరేడ్ అక్కడే..?
ఒక ఉన్మాది పాలనలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాజధాని పై ఆవేదనతో వెంకటేశ్వర రావు చనిపోయారని.. ఒక అభద్రతతోనే రైతులు చనిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు రాజధాని గ్రామాల్లో ఐదుగురు చనిపోయారని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. అధైర్య పడొద్దు....అగ్రిమెంట్ ప్రకారం రాజధాని ఇక్కడే ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఒక ప్రైవేట్ ప్లేస్ లో ఎమ్మెల్యే నిరాహార దీక్ష చెయ్యాల్సిన పరిస్ధితిని తీసుకొచ్చారని బాబు మండిపడ్డారు. ఆడవాళ్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని చంద్రబాబు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తోన్న వైఎస్ జగన్ సర్కార్ ఇందుకు సంబంధించి పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ, బీసీజీలు ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ సచివాలయ కార్యకలాపాలను విశాఖకు తరలించాలని సర్కార్ భావిస్తోంది.
Also Read:జగన్‌కు షాక్: అమరావతి రైతుల ఆందోళన, వాస్తవాలు ఇవీ..
దీనిలో భాగంగా ఈ నెల 20 విశాకలో తాత్కాలిక కార్యకలాపాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. విడతల వారీగా సచివాలయం తరలించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రాధాన్యత శాఖల్లో కీలక విభాగాలను ఆన్ డ్యూటీ కింద తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
జీఏడీ నుంచి మూడు సెక్షన్లు, ఆర్ధిక శాఖ నుంచి రెండు సెక్షన్లు, మైనింగ్ నుంచి రెండు, హోంశాఖ నుంచి నాలుగు సెక్షన్లు, రోడ్లు భవనాల నుంచి నాలుగు సెక్షన్లు, పంచాయతీ రాజ్ నుంచి నాలుగు సెక్షన్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఉన్నత విద్య, పాఠశాల విద్యా శాఖ నుంచి రెండేసి సెక్షన్లను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 34 శాఖల నుంచి కీలక విభాగాలను తరలించేందుకు ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది.