Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికీ టికెట్లు : చంద్రబాబు సంచలన ప్రకటన

వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 

tdp chief chandrababu naidu key announcement on ticket allotment in upcoming ap assembly elections
Author
First Published Sep 15, 2022, 9:36 PM IST

వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతకుముందు అసెంబ్లీలో రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరి, సీఎం ప్రసంగం తదితర అంశాలపై చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. 

ALso Read:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా.. మూడుసార్లు ఓడితే నో టికెట్ : మహానాడులో నారా లోకేష్

కాగా.. ఇప్పటికే మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడు సార్లు ఓడితే టికెట్ ఇచ్చేది లేదని.. అలాగే  ఇకపై ఎవరికైనా రెండు సార్లే పదవులు దక్కుతాయి లోకేష్ తేల్చిచెప్పారు. వచ్చేసారి పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శిగా తానూ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏళ్ల తరబడి పదవుల్లో వుంటే కొత్త రక్తం ఎలా వస్తుందని లోకేష్ ప్రశ్నించారు. 30 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ యాక్టీవ్‌గా లేరని.. పనిచేయని నేతలకు ఇన్‌ఛార్జ్ పదవులు వుండవని ఆయన హెచ్చరించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లకు దండం పెడితే గెలిచే పరిస్థితి వుందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వస్తే మంత్రులు పార్టీకి రిపోర్టు చేసే వ్యవస్థ తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios