Asianet News TeluguAsianet News Telugu

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు.. స్టూడెంట్ లీడర్‌గానే ఈ స్థాయికి : విద్యార్ధులతో చంద్రబాబు

యువత, నిపుణులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . తెలుగుదేశం పార్టీలో (telugu desam party) ఇంటర్న్‌‌షిప్ చేసిన 28 మంది విద్యార్థులు, నిపుణులు బుధవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు.  

tdp chief chandrababu naidu interact with students
Author
Amaravathi, First Published Jan 12, 2022, 7:46 PM IST

యువత, నిపుణులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . తెలుగుదేశం పార్టీలో (telugu desam party) ఇంటర్న్‌‌షిప్ చేసిన 28 మంది విద్యార్థులు, నిపుణులు బుధవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు.  రెండు నెలల పాటు ఇంటర్న్ షిప్ చేసిన 28 మంది ఇంటర్న్‌షిప్ (internship) సర్టిఫికెట్లను చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో ఆయన కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు, యువత ఒక గమ్యంతో పని చెయ్యాలని చంద్రబాబు సూచించారు. విద్యార్ధుల బృందం అందించిన నివేదకను పార్టీలో చర్చిస్తామని టీడీపీ అధినేత తెలిపారు.

నేటి పరిస్థితుల్లో రాజకీయల పట్ల యువత ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు సైతం రాజకీయలను, నేతలను స్టడీ చెయ్యాలని, పబ్లిక్ పాలసీలు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటాయని ఆయన అన్నారు. తనకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని, యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్‌గా పనిచేసి తరువాత రాజకీయాల్లో ఎదిగానని చంద్రబాబు గుర్తుచేశారు. నేటి రాజకీయాలను, నేతలను చూసి యువత మా ఖర్మ అనుకుంటున్నారని ఆయన అన్నారు. రెండు నెలల పాటు పార్టీలోని వివిధ విభాగాల్లో, వివిధ అంశాలపై తాము చేసిన పరిశోధనను నివేదిక రూపంలో పార్టీకి అందించారు. రీసెర్చ్, క్యాపెయిన్, మీడియా, క్రియేటివ్ విభాగాల్లో వీరు పరిశీలన జరిపి నివేదిక ఇచ్చారు.

అంతకుముందు స్వామి వివేకానంద జయంతి (swamy vivekananda jayanthi) కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించారు. ఈ  సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో  స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద జయంతిని నేషనల్ యూత్ డే (national youth day) గా జరుపుకుంటున్న సందర్భంగా  ఆ మహనీయుని స్మృతికి నివాళి అర్పిస్తూ...యువతకు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. 

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడినట్లే....నిత్యం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుందన్న సందేశం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. లేవండి...కదలండి...గమ్యం చేరే వరకు ప్రయత్నం ఆపకండి అనే వివేకానందుని మాటతో రాష్ట్రంలో అరాచక పాలనపై యువత పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసిపి (ysrcp) ప్రజా వ్యతిరేక పాలనతో యువత భవిష్యత్ అంధకారం అయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు రాక నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక రాష్ట్రం లో 358 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios