గాల్వాన్‌ లోయ వద్ద చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబసభ్యులకు టీడీపీ జాతీయాధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు.

సంతోష్ తండ్రి ఉపేందర్‌తో మాట్లాడిన బాబు.. దేశం కోసం ప్రాణాలర్పించిన ధన్యజీవి సంతోష్ బాబని కొనియాడారు. భారత్- చైనా బలగాల మధ్య గాల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.

Also Read:సోమవారం కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్

ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది. సంతోష్ బాబు అంత్యక్రియలు ఆయన స్వస్థలం సూర్యాపేటలో వేలాది మంది అశ్రు నయనాల మధ్య సైనిక లాంఛనాల మధ్య జరిగాయి.

మరోవైపు సోమవారం రాత్రి గాల్వాన్‌ లోయ వద్ద ఏం జరిగింది..? ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండానే మనదేశం వైపు 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీ సంఖ్యలో సైనికులు క్షతగాత్రులవ్వడం సాధారణ విషయం కాదు.

Also Read:కల్నల్ సంతోష్ కుటుంబానికి రూ.5కోట్లు, భార్యకు గ్రూప్1 జాబ్: కేసీఆర్ ప్రకటన

అయితే భారత సైన్యంపై దాడికి చైనా సైన్యం ఇనుప చువ్వలు బిగించిన ఐరన్ రాడ్లను ఉపయోగించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన మేకుల్లాంటి ఇనుప చువ్వలను వెల్డింగ్ చేసి ఉన్న ఫోటోలను ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్ శుక్లా ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.