నీతి అయోగ్ తాజాగా విడుదల చేసిన జాతీయ ఎగుమతుల సన్నద్ధత సూచీపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పందించారు.  

నీతి అయోగ్ తాజాగా విడుదల చేసిన జాతీయ ఎగుమతుల సన్నద్ధత సూచీపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు స్పందించారు. "ఎగుమతుల సన్నద్దత సూచి 2020"లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండటం విచారకరమన్నారు.

అటు తీర ప్రాంత రాష్ట్రాల జాబితాలో 7వ స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. అతి పొడవైన తీర ప్రాంతం వున్న మన రాష్ట్రం కనీసం 8 తీర ప్రాంత రాష్ట్రాలతో పోటీపడలేక 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పోర్టులు లేకున్నా తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉంటే.. ఒక మేజర్ పోర్టు, 11 మైనర్ పోర్టులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇలా దిగజారిపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. 

Scroll to load tweet…