అనారోగ్యంతో మరణించిన ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్ధర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు సంతాపం తెలియజేశారు.
తన పాటతో సమాజాన్ని ఉత్తేజ పరిచిన ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్ధర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన లేరన్న వార్త తెలిసి సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు సంతాపం తెలియజేశారు.
“ప్రజా గాయకుడు” గద్దర్ మృతి పట్ల నా సంతాపం తెలియచేస్తున్నాను. తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన “ప్రజా యుద్ధనౌక” గద్దర్. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో... పౌరహక్కుల పోరాటాల్లో...ఒక శకం ముగిసినట్లు అయ్యింది. గద్దర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను ’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు
‘‘ ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారు. తెలంగాణ ఉద్యమ గళం అయ్యారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే ’’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
కాగా.. గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారుడిగా, గాయకుడిగా ఆయన తెలంగాణ సమాజంపై చెరగని ముద్రవేశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాటులు ప్రజా చైతన్య ధివిటీలుగా వెలిగాయి. యువ ఉద్యమకారులు నరనరాన నిండి ఉత్సాహాన్ని ఉరకలు వేసేలా చేశాయి. ప్రజా గాయకుడిగా బయట స్టేజ్ ల మీద పెర్ఫామ్ చేస్తూ.. ఇటు ఉద్యమ సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారు. సినిమాల్లో ఉద్యమ పాటల ద్వారా ఆయన ప్రజలకు ఇంకా త్వరగా చేరువయ్యారు. మరీ ముఖ్యంగా దాసరి నారాయణ రావు.. ఆర్ నారాయణమూర్తి సినిమాలకు గద్దర్ ఎక్కువగా పాటలు రాశారు.
1979 లో మా భూమి సినిమాలో గద్దర్ రాసి బండెనక బండి కట్టి పాటను వాడారు. నిజానికిరజాకార్ల ఉద్యమం కోసంవిప్లవ గీతంగా గద్దర్ రాసి పాడిన ఆ పాటల.. జన హృదయాలను గెలిచింది. యువతను ఉర్రూతలూగించింది. ఇన్నేళ్ళు అవుతున్న ఇంకా ఇప్పటికీ బండెనక బండి కట్టీ.. అంటూ పాట వినిపిస్తూ ఉంది అంటే.. గద్దర్ రచన.. ఆయన గాత్రం.. భావం ఎంతలా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందో అర్ధం అవుతుంది.
