రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుండి అనారోగ్యం బారినపడ్డ చంద్రబాబు నిన్న బెయిల్ పై విడుదలయ్యారు. నేడు వైద్యం కోసం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు.  

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న సాయంత్రం విడుదలయ్యారు. ఇవాళ తెల్లవారుజామున ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఆయన కుటుంబంతో గడుపుతున్నారు. ఇవాళ (బుధవారం) ఆయన వైద్యం కోసం హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఉండవల్లి నివాసం నుండి ఇవాళ మద్యాహ్నం చంద్రబాబు హైదరాబాద్ కు పయనం కానున్నారు. మద్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి 3.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో 4.45 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని ఏపీ పోలీసులు వెల్లడించారు. 

ఇక శంషాబాద్ విమానాశ్రయం నుండి 5 గంటలకు బయలుదేరతారు. 5.50 గంటలకు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకోన్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక వైద్య పరీక్షల కోసం చంద్రబాబు వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Read More మళ్లీ డిల్లీకి పయనమైన నారా లోకేష్ ... తండ్రి విడుదలైనా న్యాయంకోసం పోరాటమే..

అయితే హైదరాబాద్ కు వెళ్లేముందు సతీసమేతంగా తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని చంద్రబాబు భావించారు. కారణమేంటో తెలీదుగానీ చంద్రబాబు తిరుమల పర్యటన అర్దాంతరంగా రద్దయ్యింది. దీంతో మద్యాహ్నం వరకు ఉండవల్లి నివాసంలోనే వుండనున్న చంద్రబాబు సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకున్నారు. 

పార్టీ అధినేత చంద్రబాబు నాయడు జైలునుండి విడుదలై వస్తున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి నాయకులు సిద్దమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం బయటే చంద్రబాబును కలిసేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు వెంటే టిడిపి నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ లోని ఇంటివరకు చేరుకోనున్నట్లు సమాచారం.