Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ టెర్రరిజం... ఖాకీ డ్రెస్ విప్పి వైసిపి దుస్తులోకి మారండి: చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పోలీస్ వ్యవస్థ మొత్తం అధికార వైసిపికి కొమ్మ కాస్తోందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. 

TDP Chief Chandrababu Fires on AP Police
Author
Amaravathi, First Published Mar 14, 2020, 8:20 PM IST

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో యథేచ్ఛగా పోలీస్ టెర్రరిజం, ఖాకీ టెర్రరిజం కొనసాగుతోందంటూ పోలీస్ వ్యవస్థపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులే టెర్రరైజ్ చేస్తూ టెర్రరిజానికి పాల్పడితే ఆ రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మారుతుందని.. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోందని మండిపడ్డారు. 

స్థానికసంస్థల ఎన్నికల ఇతర పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నివిధాలా అడ్డుకోవచ్చో అన్నివిధాలా వైసిపి అడ్డుకోవడం జరిగిందని అన్నారు. వీటినుండి తప్పించుకుని ముందకువెళ్లిన ప్రత్యర్ధిపార్టీల నాయకుల కోసం ముందుగానే ప్రభుత్వం ఒక నల్లచట్టం తీసుకురాడం జరిగిందన్నారు. వీళ్లకు కావాల్సిన ఆంక్షలన్నీ అందులో పెట్టుకోవడం జరిగిందన్నారు. 

ఇక ఎన్నికల సందర్భంగా చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులకు పాల్పడటం జరుగుతోందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులుగా పోటీచేసేవాళ్లపై దాడులు చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చట్టపరంగా, రాజ్యాంగం ప్రకారం ఎవరైతే పనిచేయాలో అలాంటి పోలీసులే వాటిని ఉల్లంఘించడం మరింత దారుణమన్నారు. 

ఈ పోలీస్ టెర్రరిజం మామూలుగా లేదని... దీన్ని ఇనిస్టిట్యూషనలైజ్ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా చట్టప్రకారం పనిచేయాలన్నా వీలుకాని టెర్రరిజం క్రియేట్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసుల పైనా టెర్రిరిజం చేసి వాళ్లు కూడా హెల్ప్ లెస్ అయ్యే పరిస్థితి తెచ్చారన్నారు.

read more   అందుకే మేం ఓడాం, జగన్ గెలిచాడు: ఇన్నాళ్లకు కారణం చెప్పిన పవన్ కల్యాణ్

''అధికారం ఉంది కదా.. మేము నామినేట్ చేసుకంటాం అని చెప్పివుంటే ప్రజలకు ఈ బాధలు, కష్టాలు, శారీరక హింస, మానసిక హింస తప్పేవి.  ఒకపక్క మానసికంగా ఆందోళనకు గురిచేయడం ఇంకో పక్కన ఆర్థిక మూలాలు దెబ్బతీసేవిధంగా ప్రయత్నం చేయడంతో జరుగుతోంది. రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించి, భయభ్రాంతులకు గురిచేయడం మంచిదికాదు'' అని సూచించారు.

''ఏ ప్రజలైతే రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలనుకుంటున్నారో వారిని ఆ పని చేయకుండా చేస్తూ ఎప్పుడూ చూడని వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు. నామినేషన్ల సమయంలో అనేక దాడులు చేశారు. అవన్నీ ప్రతిఘటించి మారువేషాల్లో వెళ్లి నామినేషన్లు వేసే పరిస్థితి వచ్చింది. అప్పటికి ఫలితం లేకుండా పోయింది. అలా వైసిన నామినేషన్లపై కూడా తరువాత స్కూటినీలో అరాచకాలు చేశారు. అడ్డగోలుగా స్కూటినీలో ఏకపక్షంగా చేశారు. ఇప్పుడు  మళ్లీ విత్ డ్రావల్ లో అదే హింస, వేధింపులు చేస్తున్నారు. ప్రలోభాలు పెట్టారు, డబ్బులిచ్చారు, బెదిరించారు'' అని చంద్రబాబు ఆరోపించారు.

''పోలీసులే టెర్రరైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. దాంతో చాలామంది అవన్నీ తట్టుకోలేక, హింస భరించలేక సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే సందర్భమిది. అభ్యర్ధులను కొట్టే హక్కు ఎవరిచ్చారు పోలీసులకు.. ఇది పోలీస్ టెర్రిరిజం కాక మరేమిటి? నిజాయితీగా, బాధ్యతతో బతికే పౌరులు ఎన్నికల్లో పోటీచేస్తున్నారని, వారిని హింసిస్తారా?  జైళ్లకు వెళ్లొచ్చిన వైసీపీనేతలకు సిగ్గులేదు కాబట్టి, అందరూ కూడా వాళ్లమాదిరే సిగ్గులేకుండా ఉంటారని అనుకుంటున్నారు'' అని  మండిపడ్డారు. 

read more   ఒక్క ఎమ్మెల్యే...: రాపాక వరప్రసాద్ పై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

''రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పోటీచేయడమే వాళ్లు చేసిన తప్పా..?ఆడవాళ్లపై బైండోవర్ కేసులు పెట్టడం ఏంటి..? ఈస్ట్  గోదావరిలోని జగ్గంపేటలో ఒకతను పోటీచేస్తే పోలీసులకేం పని అక్కడ. భార్యా,భర్త తమకు తాముగా మేము పోటీచేస్తున్నామని చెబితే ఎవడో చెప్పాడని చెప్పి పోలీసులు అక్కడ టెర్రిరిజం చేస్తారా... అది ఖాకీ టెర్రిజం కాక మరేమిటి?  వైసిపి డ్రస్సులు వేసుకుని పనిచేయండి కావాలంటే..ఖాకీ దుస్తులు వేసుకుని తప్పుడు పనులుచేయడం,  వైసిపి వాళ్లకు అనుకూలంగా చేయడం ఏంటి..డిజిపి దానికి సమాధానం చెప్పాలి'' అంటూ చంద్రబాబు పోలీసులపై విరుచుకుపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios