కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి మంత్రులు బయటకు వచ్చేస్తున్నారు. గురువారం కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఇద్దరినీ రాజీనామాలు చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. మీడియా సమావేశంలో చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారు. సహాయం చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనబడలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపి అభివృద్ధికి సహకరించకూడదని నిర్ణయించుకున్నట్లే కనబడుతోందని మండిపడ్డారు.  అందుకనే కేంద్రంలోని ఇద్దరు మంత్రులతో రాజీనామాలు చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వంలో ఉండి ఉపయోగం లేదని అర్ధమైపోయిందన్నారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడికి కూడా తెలియజేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. అందుకనే గురువారం తమ ఎంపిలను కేంద్రమంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని ఆదేశించినట్లు చంద్రబాబు చెప్పారు.మొదటి మెట్టుగా కేంద్ర మంత్రివర్గంలో నుండి బయటకు వచ్చేస్తున్నట్లు చెప్పారు. తర్వాత విషయాలు తర్వాత ఆలోచిస్తామన్నారు.