బాబుకు మధ్యంతర బెయిల్: టీడీపీ ఆఫీస్ వద్ద శ్రేణుల సంబరాలు

చంద్రబాబుకు  ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై  టీడీపీ శ్రేణులు  సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.  గుంటూరులోని  పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశాయి.

TDP celebrates After  Chandrababunaidu getting   interim Bail lns


అమరావతి:చంద్రబాబుకు మధ్యంతర బెయిల్  మంజూరు కావడంతో గుంటూరు టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారంనాడు టపాకాయలు  కాల్చి సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఆ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి తమ హర్షం వ్యక్తం చేశారు.

తమకు చట్టం, న్యాయం మీద గౌరవం ఉందని  అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  ఏపీ స్కిల్ కేసులో  చంద్రబాబుపై అక్రమంగా కేసు నమోదు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.   స్కిల్ కేసులో చంద్రబాబుకు  మధ్యంతర బెయిల్ రావడంతో  అచ్చెన్నాయుడు  భావోద్వేగానికి గురయ్యారు.  ధర్మం, న్యాయం గెలుస్తుందని  ఆయన  అభిప్రాయపడ్డారు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడిని ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన  నంద్యాలలో అరెస్ట్ చేశారు.

also read:మద్యం కంపెనీలకు అనుమతులపై సీఐడీ కేసు: ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు బాబు పిటిషన్

గుంటూరులోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  చంద్రబాబుకు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు.  అయితే  చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని  ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

బెయిల్ పై ఏపీ హైకోర్టు తీర్పు కాపీని  చంద్రబాబు లాయర్లు  రాజమండ్రి జైలు అధికారులకు  సమర్పించనున్నారు.ఈ ప్రక్రియ పూర్తైతే చంద్రబాబు ఇవాళ సాయంత్రం జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు  పలు కేసులు చంద్రబాబుపై నమోదయ్యాయి.

ఏపీ ఫైబర్ నెట్ కేసు,  అమరావతి  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు, అంగళ్లు  కేసులో చంద్రబాబుపై  కేసులు నమోదయ్యాయి. అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  ఏపీ ఫైబర్ నెట్ కేసులో  ఏపీ సీఐడీ  పీటీ వారంట్ కు ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఈ ఏడాది నవంబర్  8న సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios