మద్యం కంపెనీలకు అనుమతులపై సీఐడీ కేసు: ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు బాబు పిటిషన్
మద్యం కంపెనీలకు అనుమతుల విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు లాయర్లు ఇవాళ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: మద్యం కంపెనీలకు అనుమతుల విషయంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు మంగళవారంనాడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఎంగా ఉన్న సమయంలో మద్యం తయారీ కంపెనీలకు అనుమతుల విషయంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అభియోగాలు మోపింది. పీసీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కొన్ని మద్యం తయారీ సంస్థలకు ప్రయోజనం చేకూరేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఏపీబ్రేవరేజేస్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.ఈ కేసులో ఏ1 గా సుధాకర్, ఏ2 కొల్లు రవీంద్, ఏ3 చంద్రబాబు పేర్లను ఏపీ సీఐడీ నమోదు చేసింది. ఈ విషయమై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ నిన్న పిటిషన్ దాఖలు చేసింది.
also read:చంద్రబాబుకు ఊరట: స్కిల్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది.
రెండు బ్రేవరేజీలు, మూడు డిస్టిలరీలకు లబ్ది చేకూర్చేందుకు మద్యం పాలసీని మార్చారని ఏపీబ్రేవరేజేస్ ఎండీ ఆరోపిస్తున్నారు. కొన్ని మద్యం తయారీ సంస్థలకు ప్రయోజనం కలిగేలా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చారని ఆరోపించింది బ్రేవరేజేస్ సంస్థ, 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకు వచ్చిన ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారని ఆ సంస్థ ఆరోపించింది. ఈ సంస్థ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇవాళ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఏపీ ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు కేసు, ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులు కూడ నమోదయ్యాయి.ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్ కు ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింద.అయితే ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై నవంబర్ 9న విచారణ నిర్వహించే అవకాశం ఉంది.