Asianet News TeluguAsianet News Telugu

ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం.. చంద్రబాబు కీలక నిర్ణయం

ఎల్లుండి నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే ఆలోచనలో వుంది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కేవలం ఒకే ఒక్కరోజు సమావేశాలు పెట్టడంపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

tdp boycott ap assembly budget 2021 session ksp
Author
Amaravathi, First Published May 18, 2021, 5:17 PM IST

ఎల్లుండి నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే ఆలోచనలో వుంది తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కేవలం ఒకే ఒక్కరోజు సమావేశాలు పెట్టడంపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాన్ని తీసుకున్నారు అధినేత చంద్రబాబు నాయుడు. బడ్జెట్‌‌పై చర్చ జరగకుండా అసెంబ్లీ సమావేశాలు ఏంటని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. 

మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఒక్క రోజు మాత్రమే  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం  నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది జూన్ రెండో వారంలో  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read:ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి బుగ్గన

దీంతో ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరపాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదే రోజున ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కరోనా నేపథ్యంలో ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే యోచనలో జగన్ ప్రభుత్వం ఉంది.

ఈ నెల 20వ తేదీన ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ వెంటనే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు మాసాల బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios