ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ సమావేశాలు: బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి బుగ్గన

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఒక్క రోజు మాత్రమే  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం  నిర్ణయం తీసుకొంది. 

Andhra Pradesh Assembly Session from May 20 lns

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఒక్క రోజు మాత్రమే  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం  నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది జూన్ రెండో వారంలో  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజున  ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కరోనా నేపథ్యంలో ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. అయితే ఈ నిర్ణయంపై టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది.

ఈ నెల 20వ తేదీన ఉదయం రాష్ట్ర మంత్రివర్గం  సమావేశం కానుంది. బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.   రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు మాసాల బడ్జెట్ కు  ఏపీ ప్రభుత్వం  ఆర్డినెన్స్  తీసుకొచ్చింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios