టీడీపీ-జనసేన-బీజేపీ నేతల భేటీ: సీట్ల సర్ధుబాటుపై చర్చలు
తెలుగుదేశం, బీజేపీ, జనసేనల ఉమ్మడి సమావేశం ఇవాళ జరగనుంది. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి.
హైదరాబాద్: తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీ నేతల ఉమ్మడి సమావేశం సోమవారం నాడు విజయవాడలో జరగనుంది. ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై మూడు పార్టీల నేతలు చర్చించనున్నారు.
also read:అరుదైన గౌరవం:స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హైద్రాబాద్ మెట్రో రైలు విజయగాధ
30 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ స్థానాలను జనసేన, బీజేపీకి టీడీపీ కేటాయించింది. మిగిలిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది. ఎన్‌డీఏలో చేరాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఈ నెల 7,9 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చర్చించారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు,పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఈ విషయమై ఈ నెల 9వ తేదీన జే.పీ. నడ్డా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
also read:ముహుర్తం ఫిక్స్: వైఎస్ఆర్‌సీపీలోకి ముద్రగడ పద్మనాభం
తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇప్పటికే తొలి విడత జాబితాను ప్రకటించాయి. తొలి విడతలో 99 మంది అభ్యర్థులను ఈ రెండు పార్టీలు ప్రకటించాయి. అయితే బీజేపీతో పొత్తు విషయం తేలిన తర్వాత మలి విడత జాబితాను ప్రకటించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో మూడు పార్టీల నేతలు ఇవాళ విజయవాడలో సమావేశం కానున్నారు. ఏ స్థానంలో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై చర్చించనున్నారు.
also read:రోబో ద్వారా భోజనం సరఫరా: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
న్యూఢిల్లీ నుండి చంద్రబాబు హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ నుండి ఇవాళ ఉదయం విజయవాడకు రానున్నారు. న్యూఢిల్లీ నుండి పవన్ కళ్యాణ్ నిన్ననే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: పదేళ్ల తర్వాత మూడు పార్టీల మధ్య పొత్తు పొడుపు
ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ లతో పాటు మూడు పార్టీలకు చెందిన నేతలు కూడ ఈ సమావేశంలో పాల్గొంటారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. 2014 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కూటమి తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.