అసెంబ్లీని రద్దు చేసి విజయం సాధిస్తే టీడీపీని రద్దు చేస్తాం: వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్

టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. దొంగఓట్లతోనే కుప్పంలో వైసీపీ గెలుపొందిందని చెప్పారు. కుప్పంలో మంత్రులు దండయాత్ర చేశారన్నారు.

Tdp Ap chief  Atchannaidu challenges to ycp


అమరావతి:ప్రజల్లో మీ పాలనపై విశ్వాసం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీకి సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే  టీడీపీని రద్దు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.మున్సిపాల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రధానంగా కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజయంపై మాట్లాడారు. kuppam లో విజయంపై మంత్రులు ఏనేవో మాట్లాడుతుననారన్నారు. కుప్పంలో గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు.కుప్పంలో మంత్రులు దండయాత్ర చేశారన్నారు. దొంగ ఓట్లతో కుప్పంలో  వైసీపీ గెలిచిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. అయినా కూడ ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.

దాచేపల్లిలో తమ పార్టీ అభ్యర్ధులను చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. దాచేపల్లిలో రెండు మూడు స్థానాల ఫలితాలను అధికారులను అడ్డుపెట్టుకొని వైసీపీ తారుమారు చేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.  కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయకుండా అడ్డుకొన్న చరిత్ర ఏనాడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.. దర్శి, జగ్గయ్యపేట, కొండపల్లిలో Ycp ఎందుకు గెలవలేదని atchannaidu ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వంత వార్డులో టీడీపీ విజయం సాధించిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చిందని తేలిందన్నారు. ఈ ఎన్నికల్లో తమకు 12 శాతం ఓట్లు పెరిగాయని అచ్చెన్నాయుడు తెలిపారు. 

also read:చంద్రబాబు 'కుప్పం' కోట బద్దలు: చక్రం తిప్పిన మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలోని కుప్పం , పెనుకొండ లాంటి స్థానాల్లో కూడా టీడీపీ ఓటమి పాలైంది. కుప్పంలో టీడీపీ ఓటమి పాలు కావడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ స్థానంలో వైసీపీ విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి. కుప్పంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొంది. ఈ ఎన్నికల్లో విజయంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో తనపై పోటీ చేయాలని చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios