చంద్రబాబు 'కుప్పం' కోట బద్దలు: చక్రం తిప్పిన మంత్రి పెద్దిరెడ్డి
కుప్పం మున్సిపాలిటీలో టీడీ.పీ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గంలోని మెజారిటీ స్థానిక సంస్థల్లో వైసీపీ పాగా వేసింది. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహారచన పనిచేసింది.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కుప్పం కోటను బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగురవేయడంలో ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుసరించిన వ్యూహాం ఫలించింది. కుప్పం మున్సిపాలిటిపై వైసీపీ జెండాను ఎగురవేసి చంద్రబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో షాకిచ్చారు. అంతేకాదు పుంగనూరులో తనపై పోటీ చేయాలని కూడ చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు.కుప్పం గ్రామ పంచాయితీతో పాటా ఇతర గ్రామాలను విలీనం చేసి తొలిసారిగా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. తొలిసారిగా కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగురవేసింది. కుప్పం మున్సిపాలిటీలో 19 వార్డులను వైసీపీ గెలుచుకొంది. ఆరు వార్డులకే టీడీపీ పరిమితమైంది. గతంలో జరిగిన ఎంపీటీసీ, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాజయం పాలైంది.
కుప్పం మున్సిపాలిటీలో Tdp ఓటమి పాలు కావడం వెనుక మంత్రి Peddireddy ramachandra reddy వ్యూహాం ఫలించింది. గతంలో కూడ ఎంపీటీసీ, జడ్పిటీసీ, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి ycp చుక్కలు చూపింది. kuppam అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయించడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుసరించిన వ్యూహాం ఎన్నికల ఫలితాల్లో కన్పించింది.
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంపై కేంద్రీకరించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తున్నారు. దీంతో గత ఎన్నికల సమయంలో chandrababu రెండు రౌండ్లలో వెనుకంజలో నిలిచారు. అయితే 2014 మెజారిటీతో పోలిస్తే 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ సగానికి తగ్గింది. అయితే గ్రామపంచాయితీ, ఎంపీటీసీ ఎన్నికల నాటికి వైసీపీ తన ఓట్లను పెంచుకొంది.
గతంలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ నామమాత్రం విజయాలను నమోదు చేసుకొంది. వైసీపీ అభ్యర్ధులు భారీగా విజయం సాధించారు.కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని 93 గ్రామపంచాయితీలుంటే 89 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 74 గ్రామ పంచాయితీల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధులు కేవలం 14 స్థానాల్లో మాత్రమే గెలుపొందారు.
also read:మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై చంద్రబాబు సాకులు: మంత్రి బొత్స సత్యనారాయణ
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైసీపీ విజయం సాధించింది.ఈ నియోజకవర్గంలో 69 ఎంపీటీసీల్లో టీడీపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వైసీపీకి ఈ నియోజకవర్గంలో 43 వేల ఓట్లు వస్తే, ఎంపీటీసీ ఎన్నికల నాటికి వైసీపీకి 62,957 ఓట్లు దక్కాయి.
కుప్పం మున్సిపాలిటీలో కూడా విజయం కోసం తొలి నుండి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా కూడ ఓడిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలోనే సవాల్ విసిరారు. కుప్పం వదిలి చంద్రబాబు పారిపోవాల్సిందేనన్నారు. అయితే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలుస్తారో తాను కూడా చూస్తానని చంద్రబాబు సవాల్ విసిరారు.
అయితే ఇప్పటివరకు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. జిల్లాకు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొంటూ కుప్పంలో టీడీపీ అభ్యర్ధుల ఓటమికి మంత్రి పెద్దిరెడ్డి ప్లాన్ వర్కౌట్ అయింది. దీంతో కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఆరు స్థానాలకే పరిమితమైంది.