అమరావతి:  టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. 219 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది ఆ పార్టీ. రాష్ట్ర కమిటీలో కూడ అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. బీసీలకు సింహాభాగం పదవులు దక్కాయి.

రాష్ట్ర కమిటిలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు. 18 మంది అధికార ప్రతినిధులు, 58 కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమించారు. 108 మందిని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. రాష్ట్ర కమిటీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చామని ఆ పార్టీ ప్రకటించింది.ఒక్క కోశాధికారి పదవిని కూడ నియమించారు. 

ఈ కమిటీలో 50 ఉప కులాలకు చెందిన వారికి ప్రాతినిథ్యం కల్పించారు.కమిటీలో పదవులు దక్కిన వారిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి 41 శాతం 11 ఎస్సీ, 3 ఎస్టీ, 6 శాతం మైనార్టీలకు పదవులు దక్కాయి.

సీనియర్లతో పాటు యువ నేతలకు కూడ ఈ కమిటీలో ప్రాధాన్యత కల్పించారు. పరిటాల శ్రీరామ్ లాంటి వారికి పార్టీ కమిటీలో చోటు దక్కింది. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి సంతోష్ కుమార్ రెడ్డిని జాతీయ కమిటీలో ప్రదాన కార్యదర్శిగా నియమించారు.