శాసన మండలిలో సీన్ రివర్స్... వైసిపి ఎమ్మెల్సీల చేతుల్లో ప్లకార్డులు
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. శాసనసభ, మండలి టిడిపి సభ్యులు ఆందోళనలు... వైసిపి సభ్యుల మాటలదాడితో అట్టుడుకుతున్నాయి.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ టిడిపి సభ్యుల ఆందోళనలతో దద్దరిల్లుతోంది. అటు శాసనసభలోనే కాదు ఇటు శాసన మండలిలో కూడా టిడిపి సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే మండలిలో మాత్రం సీన్ కాస్త రివర్స్ అయ్యింది. శాసనసభలో టిడిపి ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తే మండలిలో మాత్రం అధికార వైసిపి ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వైసిపి ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు.
శాసనమండలి మొదలవగానే టిడిపి ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సభను కొద్దిసేపు వాయిదా వేసారు. తిరిగి సభ ప్రారంభంకాగానే టిడిపి ఎమ్మెల్సీలు అలాగే ఆందోళన చేపట్టారు. దీంతో సభను సజావుగా నడిపేందుకు ముగ్గురు ఎమ్మెల్సీలు బిటి నాయుడు, కంచర్ల శ్రీకాంత్, అనురాధను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే శ్రీకాంత్ ను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన ఛైర్మన్ మిగతా ఇద్దరిని ఇవాళ ఒక్కరోజే చేసారు.
Read More బాలకృష్ణ ముందే మెంటల్... అసెంబ్లీ రానివ్వొద్దు..: స్పీకర్ ను కోరిన వైసిపి ఎమ్మెల్యే (వీడియో)
ఇక శాసనసభలో టిడిపి సభ్యులు వినూత్నంగా నిరసన చేపట్టారు. బాలకృష్ణతో పాటు మరికొందరు సభ్యులు విజిల్స్ తో సభకు చేరుకున్నారు. వైసిపి సభ్యులు మాట్లాడుతున్న సమయంలో విజిల్ ఊదుతూ నిరసన తెలిపారు. ఇలా చంద్రబాబు సీటువద్దకు చేరుకున్న బాలకృష్ణ కూడా విజిల్ ఊదారు. దీంతో ఆయనపై మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందుకే కదా బాలకృష్ణను మెంటల్ అనేది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి సైకోలను సభకు రానివ్వొద్దనని... ఇప్పుడు విజిల్ తెచ్చినట్లే గన్ తెచ్చి కాల్చినా కాలుస్తాడని ఆందోళన వ్యక్తం చేసారు. ముందే మెంటల్ సర్టిఫికెట్ వుంది కాబట్టి కాల్చిచంపినా బాలకృష్ణపై కేసులుండవని వైసిపి ఎమ్మెల్యే మదుసూధన్ ఎద్దెవా చేసారు.
ఇక శాసనసభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్లతో చిత్రీకరిస్తున్నారంటూ టిడిపి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బెదాళం అశోక్ ను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేసారు. నిన్నకూడా ఇలాగే కొందరు టిడిపి ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్దంగా సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తున్నారంటూ స్పీకర్ హెచ్చరించారు. అయితే వారు తీరు మార్చుకోకుండా ఇవాళ కూడా వీడియోలు తీస్తున్నట్లు స్పీకర్ దృష్టికి వైసిపి సభ్యులు తీసుకొళ్లారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసారు.