ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టింది. జనాల్లో లేకపోవడం వల్లే నేతలు దారుణంగా ఓడామని గ్రహించిన పార్టీ అధినాయకత్వం కీలక మార్పులపై దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో ఇకపై టీడీపీ కార్యకలాపాలు బెజవాడ నుంచి కొనసాగనున్నాయి. బుధవారం అమరావతిలో జరిగిన టీడీఎల్పీ భేటీ సందర్భంగా పార్టీ కార్యకలాపాల కోసం విజయవాడలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకై భవనం చూడాల్సిందిగా చంద్రబాబు నేతలకు సూచించినట్లు సమాచారం.

దీంతో రాష్ట్ర స్థాయి కార్యకలాపాలు త్వరలో అక్కడ నుంచే జరగనున్నాయి. విజయవాడలో ఏర్పాటు చేసే కార్యాలయం నుంచే ప్రతిరోజు పార్టీ కార్యకలాపాలను బాబు పర్యవేక్షించనున్నారు.