శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దీనికి పోలీసుల వేధింపులే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

మందస : శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగిలో TDP కార్యకర్త వెంకట్రావు suicide చేసుకున్నాడు. social mediaల్లో అధికార పార్టీని ప్రశ్నించినందుకు కేసుల పేరుతో పోలీసులు భయపెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల వేధింపులు భరించలేకే వెంకట్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు.

deadbodyని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబాన్ని తేదేపా నాయకురాలు గౌతు శిరీష, నేతలు పరామర్శించారు. కార్యకర్త ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఆస్పత్రి వద్ద బైఠాయించారు. 

ఇదిలా ఉండగా, వెల్దుర్తి మండలం పుల్లగుమ్మికి చెందిన రాజ శేఖర్ రెడ్డి హత్య కేసులో దాయాది సోదరులు కాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, కాసిరెడ్డి రామకృష్ణారెడ్డి, కాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (కర్నూలు 42వ వార్డు YCP Corporator)కు Life imprisonment విధిస్తూ Supreme Court సోమవారం తీర్పు వెలువరించింది. హత్యకేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు Trial court విధించిన యావజ్జీవ శిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో సాక్షులు హతుడికి బంధువులు, సన్నిహితులు కావడంతో వారి సాక్షాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి వీలు లేదంటూ నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ 2018 ఫిబ్రవరి 21న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.

2007 జనవరి 18న రాత్రి 8:30 సమయంలో 11 మంది వ్యక్తులు రాజశేఖర్ రెడ్డి, అతని సోదరుడు ఎం. నాగేశ్వర్ రెడ్డి, మరో నలుగురు వ్యక్తులు కలిసి వెళుతున్న సూమో వాహనాన్ని వెంబడించారు. దాడిలో రాజశేఖర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన ఇద్దర్నీ కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు విచారణ చేపట్టిన కర్నూలు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి సాక్ష్యాధారాల ప్రకారం ముగ్గురు ప్రధాన నిందితులు కాసిరెడ్డి రామకృష్ణారెడ్డి, కాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డికి ipc section 148, 302 కింద యావజ్జీవ శిక్ష విధించారు.

నాలుగు నుంచి 11వ నెంబర్ వరకు ఉన్న నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా శిక్ష పడ్డ ముగ్గురు హై కోర్టుకు అప్పీలుకు వెళ్లగా కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ ముగ్గురినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు బాధితులు బాధితులు సుప్రీం బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తీర్పు సమయంలో హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.