నెల్లూరు: తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్తీక్ ఆత్మహత్య నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కార్తీక్ ఆత్మహత్యకు వైసీపీ నేతల వేధింపులే కారణమని కార్తీక్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే కుటుంబ కలహాల కారణంగానే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామానికి చెందిన కార్తీక్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా పనిచేశాడు. అయితే ఇటీవలే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం కార్తీక్ కుటుంబాన్ని పరామర్శించారు. 

ఈ సందర్భంగా వైసీపీ నేతలపై లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.   కార్తీక్ ఆత్మహత్యకు వైసీపీ వేధింపులే కారణమని ఆరోపించారు. కార్తీక్ ఆత్మహత్యకి కారణమైన పోలీసులు, వైసీపీ నాయకులుకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్తీక్ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

కార్తీక్ ఆత్మహత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ వేధింపుల వల్లే కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి ఆరోపిస్తుంటే కుటుంబ కలహాల వల్లే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి స్పష్టం చేస్తున్నాడు. 

ఇకపోతే టీడీపీ అయితే వైసీపీ, పోలీసుల వేధింపుల వల్లే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తుంది. కుటుంబ కలహాల వల్లే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని తాము ఎవరిని వేధించలేదని వైసీపీ స్పష్టం చేస్తోంది. 

ఇకపోతే పోలీసులు సైతం కార్తీక్ ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ కలహాల వల్లే కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మెుత్తానికి కార్తీక్ ఆత్మహత్యపై తల్లి ఒక ఆరోపణ, తండ్రి మరోలా ఆరోపణలు చేస్తుండటం దానికి రాజకీయ దుమారం తోడవ్వడంతో నెల్లూరు పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. 
 

ఈ వార్తలు కూడా చదవండి

video news : దొంగఓట్లు వేయిస్తుంటే అడ్డుపడ్డందుకే