చెన్నై: కియా సంస్థతో తమ ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో  తాము మంచి సంబంధాలను కోరుకొంటున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

Also read:కియాపై తప్పుడు ప్రచారం, చర్యలు తప్పవు:బుగ్గన

ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి ఏపీ రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శికి ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కియా కార్ల పరిశ్రమ తమిళనాడు రాష్ట్రానికి తరలివెళ్లిపోయే అవకాశం ఉందని  ఓ వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్తలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. 

ఇదే సమయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడ ఇదే తరహాలో స్పందించింది.  ఈ వార్తల్లో ఎలాంటి సంబంధం లేదని కియా మోటార్స్  యాజమాన్యం కూడ ప్రకటించింది. కియా మోటార్స్ ఏపీ రాష్ట్రం నుండి తరలివెళ్లే అవకాశం ఉందని ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని  ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.