తమిళనాడు ఆంక్షలు: తిరుపతి స్విమ్స్ కు ఆక్సిజన్ కొరత లేదన్న కలెక్టర్
తిరుపతి స్విమ్స్ కు ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే వార్తలను కలెక్టర్ కొట్టిపారేశారు. ఎయిర్ వాటర్ సరఫరా తగ్గిన నేపథ్యంలో స్విమ్స్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కునే ప్రమాదం ఉందని వార్తలు వచ్చాయి.
తిరుపతి: చిత్తూరు జిల్లా స్విమ్స్ కు ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఎయిర్ వాటర్ సరఫరాపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రావసరాలు తీరిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఎయిర్ వాటర్ సంస్థను ఆదేశించింది.
గత 15 ఏళ్లుగా స్విమ్స్ కు ఎయిర్ వాటర్ సంస్థ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. తాము ఇక రోజుకు 8 కెఎల్ ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేయగలమని ఎయిర్ వాటర్ ప్రతినిధులు స్విమ్స్ డైరెక్టర్ కు తెలిపారు. దీంతో స్విమ్స్ డైరెక్టర్ వారితో సంప్రందింపులు జరిపుతున్నారు. కలెక్టర్ హరినారాణన్ పరిస్థితిని ఉన్నతాధికారి జవహర్ రెడ్డి దృష్టికి తెచ్చారు .
అనుకున్న ఆక్సిజన్ రాకపోతే స్విమ్స్ తీవ్రమైన ఆక్సిజన్ కొరతను ఎదుర్కునే ప్రమాదం ఉంది. ఇప్పటికే రుయాలో ఆక్సిజన్ అందక 11 మంది మరణించారు. ఈ స్థితిలో ఎయిర్ వాటర్ ఆక్సిజన్ సరఫరాపై కొత విధించడం సరి కాదని అధికారులు అంటున్నారు. స్విమ్స్ లో ఆక్సిజన్ సమస్య లేదని కలెక్టర్ చెప్పారు.