తిరుపతి బైపోల్స్: ఐదుగురితో కమిటీ, నేతలకు బాబు వార్నింగ్

తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం ఐదుగురితో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

Take Tirupati by elections seriously, chandrababu warns party leaders lns

అమరావతి: తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం ఐదుగురితో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నాడు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్, పనబాక కృష్ణయ్యలతో కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ సభ్యులు తిరుపతి ఎంపీ స్థానంలో పార్టీ ప్రచారంతో పాటు అన్ని అంశాలపై  చర్చించనుంది.ఈ ఎన్నికను పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ ఇంచార్జీ ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోని పనిచేయాలని బాబు కోరారు.లేకపోతే పార్టీ పదవుల నుండి తప్పిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ ఉప ఎన్నికల్లో రోజుకో అంశంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నేతలను కోరారు. 

ఈ ఎన్నికల్లో టీడీపీకి ఎన్నికల అడ్వైజర్ గా రాబిన్ శర్మ పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన పర్యటిస్తూ పార్టీ పరిస్థితిపై చంద్రబాబుకు ఎప్పటికప్పుడూ నివేదికలు అందిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios