తాడిపత్రి: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన తీరును మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.

శుక్రవారం నాడు ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. జగన్ మాదిరిగా సలహదారులను పెట్టుకో.. రైతులకు సహాయం చేయాలని ఆయన కోరారు.

బొందల దిన్నె.. వంగనూరు రైతులకు మానవత్వంతో సహాయం చేయాల్సిందిగా కోరారు. గతంలో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఐదు ఎకరాలను రైతుల నుండి సేకరించినట్టుగా ఆయన గుర్తు చేశారు. కానీ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదన్నారు. దీంతో రైతులను ఆర్ధికంగా ఆదుకోవాలని ఆయన కోరారు.

also read:వాహనాలు నా పేరున లేవు, కేసులెలా పెడతారు: జేసీ ప్రభాకర్ రెడ్డి

రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  జేసీ కుటుంబంపై కేసులు నమోదయ్యాయి. ఫోర్జరీ పత్రాలతో వాహనాలను విక్రయించారనే కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు జేసీ ఆస్మిత్ రెడ్డిపై కూడ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఈ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవలనే జైలు నుండి విడుదలై వచ్చాడు. తమ కుటుంబంపై జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని  జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.