అనంతపురం: సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తాను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లానని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు.

గురువారంనాడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన అనుచరులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన అనుచరులు దాడికి దిగారు.ఈ  ఘటన తర్వాత ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు.

గొడవ పెట్టుకొనేందుకు దాడి చేసేందుకు తాను జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లలేదని ఆయన చెప్పారు. తాను వెళ్లిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరన్నారు. 

సోషల్ మీడియాలో పోస్టుల గురించి తాను చర్చించడానికి వెళ్లినట్టుగా ఆయన చెప్పారు. శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు గాను తాను  మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లినట్టుగా ఆయన చెప్పారు.

also read:తాడిపత్రిలో టెన్షన్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం

 తన ఇంటిపైకి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు దాడి చేసేందుకు వచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో రాళ్లదాడి జరిగిందన్నారు. మా పార్టీ కార్యకర్తపై దాడికి దిగినట్టు చెప్పారు.

జేసీ అనుచరులే తమపై, పోలీసులపై రాళ్ల దాడికి దిగారని ఆయన ఆరోపించారు. పంచాయితీ, మండల, మున్సిఫల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తమనుభయబ్రాంతులను చేయడానికి గాను ఇలా చేశానని ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణను ఆయన ఖండించారు.

also read:కొడవళ్లతో ఇంటి మీదకొచ్చారు..చూస్తూ నిలబడ్డారు: పోలీసులపై జేసీ ఫైర్

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి తనను ఎంత ఇబ్బంది పెట్టాడో ప్రజలకు తెలుసునన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని తాను ఎప్పుడూ  కూడ పిరికిపంద మాదిరిగా వ్యవహరించలేదన్నారు.